దీపావళి ధమాకా: ధరల మోత మోగించారు..!
వినియోగదారులపై భారం పిడుగు పండింది. సిలిండర్ ధర పెరిగింది. కొత్త నిబంధనలతో బ్యాంకు సేవల రేట్లు పెంచారు.
బ్యాంకులు, చమురు సంస్థలు అన్ని వర్గాలకు షాక్ ఇచ్చాయి. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ వస్తోంది అంటే కొన్ని వర్గాల ఆందోళనకు నిరీక్షిస్తుంటాయి. ఏ అంశాలపై ధరల భారం వేస్తారనేది మదింపు చేసుకుంటూ ఉంటారు. ఆ కోవలో సామాన్యులు, మధ్య తరగతి వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా బ్యాంకింగ్ రంగంలో దగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో పాటు జాతీయ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై మోత మోగించాయి. ఇవి రెండు సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. బ్యాంకు సేవలు, గ్యాస్ సిలిండర్ వినియోగంలో ఏ వర్గం కూడా మినహాయింపు కాదు. అన్ని వర్గాలకు అవసరమైన సేవలు అందించే సంస్థలు ఇవి. దీంతో వివిధ రకాల చార్జీల పేరుతో బ్యాంకులు, మరోపక్క చమురు సంస్థలు గ్యాస్, ఇంధన ధరలు పెంచడం మినహా, తగ్గించిన వ్యవహారం కనిపించదు. ఇటీవలి కాలంలో అంటే మూడు నెలల నుంచి డొమస్టిక్ సిటిండర్ ధర రూ. 12 వందల నుంచి రూ. 850 రూపాయాలకు దిగొచ్చింది. అది కూడా స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేదు. అంతర్జాతీయం ముడిచమురు బ్యారల్ ధర ఆధారంగా ధరలు మారుతుంటాయనే విషయం తెలిసిందే..