తమిళనాడులో డీజీపీ నియామకంపై మాటకు మాట..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలమైన వ్యక్తికి తెచ్చుకునేందుకు సీఎం స్టాలిన్ చూస్తున్నారన్న ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్..
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నియామకంపై ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. డీజీపీ శంకర్ జివాల్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జి వెంకటరామన్ తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్(CM Stalin) తనకు కావాల్సిన వారి కోసం ఫుల్‌టైం డీజీపీని నియమించలేదని ఏఐఏడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(Edappadi K Palaniswami) ఆరోపిస్తున్నారు. కేంద్రం తమకు అనుకూలంగా ఉండే అధికారుల పేర్లను ప్రతిపాదించడంతో సీఎం స్టాలిన్ దాన్ని తిరస్కరించారని తమిళనాడు మంత్రి ఎస్. రేగుపతి పళనిస్వామికి కౌంటర్ ఇచ్చారు.
"డీజీపీ లేకుండా ఏఐఏడీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతకాలం పాలించిందో పళనిస్వామి మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడు రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి (ఎంకే స్టాలిన్)ను ఆయన నిందించడం విడ్డూరంగా ఉంది" అని సహజ వనరుల మంత్రి రేగుపతి అన్నారు.