‘రామనగర’ జిల్లా పేరు మార్చండి: సీఎంకు డీకే వినతి, ఎందుకంటే..

జేడీఎస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రామనగర జిల్లా పేరును మార్చాలని కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని బృందం కోరింది.

Update: 2024-07-09 11:17 GMT

'బ్రాండ్ బెంగళూరు'లో ప్రయోజనాలను పొందేందుకు రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్ కొత్తగా ఓ ప్రతిపాదన చేశారు. జిల్లా పేరు మార్చాలని డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసింది. రామనగర జిల్లా పేరును బెంగళూర్ సౌత్ గా మార్చాలని విన్నవించింది.

JD(S) నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి HD కుమారస్వామి JD(S)-BJP సంకీర్ణానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 లో రామనగర జిల్లాను ఏర్పాటు చేశాడు. రామనగర జిల్లా పేరు మార్చితే ఆమరణ దీక్షకు దిగుతానని కుమారస్వామి గతంలో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాడు.
రామనగర, చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన కుమారస్వామికి రామనగర జిల్లా రాజకీయ క్షేత్రంగా ఉంది. ఈ ప్రాంతం నుంచే ఆయన గతంలో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎన్నికల సంఘం ఇంకా తేదీని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన మాండ్య నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి, బెంగళూరు రూరల్ మాజీ ఎంపీ డీకే సురేశ్, జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో కూడిన ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి జిల్లా కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉందని, పేరు మార్చిన తరువాత ఇదే ప్రాంతం జిల్లా కేంద్రంగా మారుతుందని చెప్పారు.
రామనగర, మాగడి, కనకపుర, చన్నపట్న, హారోహళ్లి తాలూకాల ప్రజలలో బెంగళూరు ఖ్యాతి, సార్వభౌమాధికారం, ప్రతిష్ట తమ తాలూకాలకు కూడా అందుబాటులో ఉండాలనే భావన ఉంది, అదే మా ఆలోచన కూడా’’ అని శివకుమార్, ఇతర ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు.
"కాబట్టి ఈ తాలూకాలతో కూడిన ప్రస్తుత రామనగర జిల్లా పేరు మార్చాలి. రామనగర తాలూకా దాని ప్రధాన కార్యాలయంగా ప్రకటించాలి" అని వారు కోరారు. జిల్లాకు చెందిన శివకుమార్ గత ఏడాది కూడా రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చే ప్రణాళికల గురించి మాట్లాడారు. దానితో సమీపంలోని చిన్న పట్టణాలపై 'బ్రాండ్ బెంగళూరు' ప్రభావం ఉంటుందని డీకే వాదిస్తున్నాడు.
క్యాబినెట్ ముందు ప్రతిపాదన ఉంచాలి
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనను క్యాబినెట్ ముందు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. “మేమంతా బెంగళూరు జిల్లా, బెంగళూరు నగరం, దొడ్డబళ్లాపుర, దేవనహళ్లి, హోస్కోటే, రామనగర, చన్నపట్న, కనకపుర, మాగాడి ప్రాంతాలను సాంకేతికంగా, పరిపాలనను దృష్టిలో ఉంచుకుని, గతంలో బెంగళూరు రూరల్ జిల్లాగా, బెంగళూరు అర్బన్ జిల్లాగా మార్పులు, పునర్నిర్మాణాలు చేశాం. అందులో భాగంగానే రామనగర జిల్లాగా మార్చాలని కోరుతున్నాం.
రామనగర ప్రధాన కార్యాలయంగా రామనగర జిల్లా అలాగే ఉంటుందని, అయితే జిల్లాకు బెంగళూరు సౌత్ అని పేరు మార్చనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ తెలిపారు. ప్రపంచం మొత్తం బెంగళూరు వైపు చూస్తోందని ఆయన అన్నారు. ‘‘మా జిల్లా అసలు పేరు నిలబెట్టుకోవాలనుకున్నాం, అందుకే జిల్లాకు చెందిన నేతలు చర్చలు జరిపి బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చాలని నా నేతృత్వంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చాం. రామనగర, చన్నపట్న, కనకపుర, మాగడి అభివృద్ధికి దోహదపడుతుంది. పరిశ్రమలు రావడానికి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
రామనగర లేదా తుమకూరులో నగరానికి రెండో విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 2032 నాటికి ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి ఎంబీ పాటిల్ ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. సర్వేలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గతంలో దొడ్డబళ్లాపుర, నెలమంగళ, యలహంక, దేవనహళ్లి, అనేకల్, బెంగళూరు సౌత్, బెంగళూరు ఈస్ట్, హోస్కోటే, రామనగర, మాగాడి, కనకపుర, చన్నపట్న తాలూకాలు బెంగళూరు జిల్లాలో భాగంగా ఉన్నాయని, 1986లో కొత్తగా బెంగళూరు రూరల్ జిల్లాను ప్రకటించినట్లు మెమోరాండం పేర్కొంది. 2007లో, దొడ్డబల్లాపురను కేంద్రంగా బెంగళూరు రూరల్ జిల్లా హోసకోటే, నెలమంగళ, దేవనహళ్లితో కలిపి ఏర్పాటు చేశారు. ఇదే సంవత్సరంలో రామనగర ప్రధాన కార్యాలయంగా మాగాడి, కనకపుర, చన్నపట్న రామనగరలతో కూడిన ప్రత్యేక రామనగర జిల్లా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News