కర్ణాటకలో డీకే శివకుమార్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

‘‘రాజ్యాంగాన్ని మార్చాల్చి వస్తుంది’’ అన్న డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై దుమారం.;

Update: 2025-03-24 07:01 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లో ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ముస్లిం(Muslims)లకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశంపై.. “రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుంది” అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shiv Kumar) చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం సృష్టిస్తు్న్నాయి.

ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కర్ణాటక అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

“రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయి”

మార్చి 23న మీడియా సంస్థ న్యూస్‌18తో శివకుమార్‌ మాట్లాడారు. “ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. సమాజంలోని ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాదే. అందుకోసమే నిర్ణయం తీసుకున్నాం.” అని డీకే పేర్కొ్న్నారు.

ప్రతిపక్షం ఈ అంశాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న శివకుమార్.. “ఎవరు కోర్టుకు వెళ్తారో తెలుసు. కోర్టు ఏం చెప్పుతుందో చూద్దాం. మంచి రోజు తప్పకుండా వస్తుంది. రాజ్యాంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగాన్ని మార్చిన తీర్పులు కూడా ఉన్నాయి” అని పేర్కొన్నారు.

బీజేపీ ఫైర్..

కాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మైనారిటీలను సంతృప్తిపరచడమే ముఖ్యమని, వారికి మరేది ముఖ్యంకాదని మండిపడింది. “కర్ణాటక డిప్యూటీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిందే అని బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదు. మత ఆధారంగా దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. ముస్లింలు దేశంలోనే ఉండిపోయేలా చూసింది. హిందువులకు న్యాయం చేసిన చరిత్ర ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు లేదు. భవిష్యత్తులోనూ ఉండదు” అని ’’ అని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్ మాలవ్యా ఎక్స్‌లో (X) పోస్టు చేశారు.

‘కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై నమ్మకమే లేదు’

బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగాన్ని మార్చాలన్న మనసులో మాటను బహిరంగంగానే బయటపెట్టారు” అని విమర్శించారు.

“కాంగ్రెస్‌ పార్టీ భారత రాజ్యాంగానికి, రిజర్వేషన్ల విధానానికి, అంబేడ్కర్‌ సిద్దాంతానికి వ్యతిరేకం. గవర్నమెంటు కాంట్రాక్టులో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం రాజ్యాంగంలో లేదని డీకే శివకుమార్‌ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు” అని అన్నారు.

“రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని పదేపదే ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయనే మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. రాహుల్‌ గాంధే చెప్పాలి. ఎవరు రాజ్యాంగానికి నిజమైన శత్రువులు?” అని పూనావాలా ప్రశ్నించారు. 

Tags:    

Similar News