ఎన్‌సీపీ చీఫ్ శరత్ పవార్‌కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సవాల్..

"ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్నారు. ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరో శరత్ పవార్ సాహెబ్‌ను ప్రకటించమనండి.’’ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

Update: 2024-10-16 15:11 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 20వ తేదీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటములు ప్రచార ఏర్పాట్లలో బీజీగా ఉన్నాయి. అయితే మహా వికాస్ అఘాడీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ఒక విలేఖరి ప్రశ్నించడంతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి (షిండే) "ఇక్కడ కూర్చున్నారు" అంటూ.. మహాయుత కూటమి తమ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు సవాల్ విసిరారు పడ్నవీస్.

శివసేన-బీజేపీ-ఎన్‌సీపీ కూటమికి సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి షిండేతో పాటు డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌తో పాటు పక్కనే కూర్చున్న ఫడ్నవీస్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్నారు. మీరు అడగండి. వారి (ప్రతిపక్షాలు)

సీఎం అభ్యర్థి ఎవరో (శరద్) పవార్ సాహెబ్‌ను ప్రకటించమనండి. అధికార కూటమిలో ఎవరూ అత్యున్నత పదవి కోసం తహతహలాడడం లేదని, గత రెండేళ్లకుపైగా మా చేసిన అభివృద్దే మా ముఖం అని షిండే పేర్కొన్నారు.

Tags:    

Similar News