Dharmasthala: కొనసాగుతున్న తవ్వకాలు.. బయటపడుతున్న అస్తిపంజరాలు

కేసు ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారుడిపై ఒత్తిడి తెచ్చిన ఓ దర్యాప్తు అధికారిపై న్యాయవాది లిఖిత పూర్వక ఫిర్యాదు..;

Update: 2025-08-02 10:11 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లోని ధర్మస్థల పుణ్యక్షేత్ర పరిసరాల్లో సామూహిక ఖననాలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా SIT అధికారులు తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ బృందంలోని ఓ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదుదారుడిని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కేసు విత్‌డ్రా చేసుకోవాలని తన క్లయింట్‌ పారిశుధ్య కార్మికుడిపై ఓ ఇన్‌స్పెక్టర్ ఒత్తిడి తెచ్చారని న్యాయవాది అనన్య గౌడ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ సదరు ఇన్‌స్పెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


13 ప్రదేశాల్లో తవ్వకాలు..

కేసు దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారుడు ఆలయ సమీపంలో, నేత్రావతి నది ఒడ్డున చెప్పిన 13 ప్రదేశాలలో తవ్వకాలు జరిపించారు. కొన్ని చోట్ల బయటపడ్డ మానవ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


అసలు కేసేమిటి?

1998-2014 మధ్యకాలంలో తాను కొన్ని వందల మంది మహిళలు, యువతులు, మైనర్ బాలికలు మృతదేహాలను ఖననం చేశానని ధర్మస్థల ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడి ఒకరు ఇటీవల పోలీసులకు చెప్పారు. ఈ విషయం చాలాసార్లు బయటకు చెప్పాలనుకున్నా.. కొంతమంది చంపేస్తామని బెదిరించడంతో చెప్పలేకపోయానని.. పశ్చాత్తాప భావన వెంటాడుతుండడంతో ధైర్యం కూడగట్టుకుని ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని చెప్పాడు.

ఈ కేసు ధర్మస్థల పుణ్యక్షేత్రంతో ముడిపడి ఉండడం, సున్నితమైనది కావడంతో కర్ణాటక సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇటు సిట్ అధికారులు పారిశుధ్య కార్మికుడు చెప్పిన ఆరు చోట్ల తవ్వకాలు జరిపించారు. ఒక చోట మాత్రం పూర్తి అస్థిపంజరం బయటపడింది. మిగతా 5 చోట్ల మానవ అవశేషాలు కనిపించలేదు. అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్, అటవీ అధికారులు, ఇతర సంబంధిత అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. వారి వెంట వైద్య సిబ్బంది, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కూడా ఉంటున్నారు. 

Tags:    

Similar News