తమిళనాడు బిజెపి ఎం కలకంటున్నదంటే...

తమిళనాడులో ఎన్నికల ఫలితాల తరువాత అన్నాడీఎంకే కనుమరుగు అవుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై జోస్యం చెబుతున్నారు. నిజంగా అలా జరిగే అవకాశం ఉందా?

Update: 2024-04-16 05:28 GMT
అన్నా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి

తమిళనాడులో సార్వత్రిక ఎన్నికల తొలి దశ ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఇండి (INDI Alliance)  కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే లు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ద్రవిడవాద గడ్డపై ఎలాగైన జెండా పాతాలని చూస్తున్న బీజేపీ ఎన్నికల బరిలోకి దూకడానికి కంటే ముందే అన్నా డీఎంకేతో పొత్తును వదులుకుంది. తను సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూనే కలిసి వచ్చే ఇతర పార్టీలను పొత్తు బంధంతో కలుపుకుంది. ఇందులో భాగంగా బీజేపీ మరో పాచిక వేసినట్లు కనిపిస్తోంది. వారసత్వ రాజకీయాలను తిరిగి ప్రజాక్షేత్రంలో చర్చకు లేవనెత్తింది.

తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై తమ భాగస్వామ్య పార్టీ ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి అయిన టీటీవీ దినకరన్ తరఫున ప్రచారం చేస్తూ.. ఎన్నికల ఫలితాల తరువాత ఏఐఏడీఎంకే పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు తిరిగి దినకరన్ వైపు చూస్తారని అన్నారు. దినకరన్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ మేనల్లుడు.
వారసత్వ పోరాటం
మాజీ ముఖ్యమంత్రి ఎళప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం ఎన్నికల ఫలితాల తరువాత మనసు మార్చుకుని దినకరన్ వైపు వస్తారని అన్నామలై ఇంతకుముందు పుతియతలైమురై( తమిళనాడులోని న్యూస్ ఛానల్) ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన ఇంతకుముందు కూడా ఇదే ప్రకటన వెలువరించారు.  "అన్నా డీఎంకే కు ఇవే చివరి ఎన్నికలు దీంతో ఆ పార్టీ చరిత్ర ముగుస్తుంది,"ని ఆయన జోస్యం చెప్పారు.
మరో ఏఐఏడీఎంకే అసమ్మతి నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) కోసం రామనాథపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ, డీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ని డీఎంకే నేత ఎం. కరుణానిధి బహిష్కరించినట్లు, ఓ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే నాయకులు బహిష్కరించారని అన్నామలై విమర్శించారు. ఇది ఆ పార్టీ చేసిన రెండో ద్రోహమని దుయ్యబట్టారు.
జూన్ 4 తర్వాత తమిళనాడులో ఓపీఎస్ విశ్వరూపం కనిపించనుంది. అసలు నాయకుడెవరో, అమ్మ (జయలలిత) తనపై పూర్తి విశ్వాసం ఉంచిన నాయకుడెవరో ప్రజలకు తెలుసునని అన్నామలై అన్నారు. రెండు సభల్లోనూ అన్నామలై జయలలితను "అమ్మా" అని సంబోధించారు. గతంలో ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత అవినీతికి పాల్పడిన నాయకురాలని ఆయన పరోక్షంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చీలికకు దారితీసిన అంశాల్లో ఇదీ ఒకటి.
ఓపీఎస్‌, దినకరన్‌తో పొత్తు
అన్నాడీఎంకే మాజీ అధినేత, ఆ పార్టీకి ఓట్లు రాల్చే అమ్మ పై అన్నామలై అవినీతిలో కూరుకుపోయారని విమర్శలు చేయడంతో ఎడప్పాడి పళని స్వామి బీజేపీతో పొత్తుకు ససేమిరా అన్నారు. ఇక చేసేదేమి లేక కమలదళం తమతో ఒకప్పుడు విబేధించిన టీటీవీ దినకరన్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.
ఆసక్తికరంగా, అన్నాడీఎంకేలో ఇద్దరు నేతలకు స్థానం లేదని పళనిస్వామి నిర్ణయించడానికి ముందు, OPS..దినకరన్ ఒకరితో ఒకరు విభేదించారు. జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించిన శశికళపై ఓపీఎస్ అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, పళనిస్వామి పార్టీలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత, నాయకత్వ పాత్రను కాపాడుకోవడం ఆ తరువాత రెండు ఆకుల చిహ్నాన్ని నిలబెట్టుకోవడంతో, OPS, దినకరన్‌లు ఇద్దరు కూడా బీజేపీ వైపుకి మొగ్గారు.
శశికళ విధేయతపై అనిశ్చితి
మరోవైపు శశికళ విధేయతపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆమె తన మేనల్లుడు దినకరన్‌కు ప్రచారానికి కూడా దూరంగా ఆమె.. ఎన్నికల కాలం అంతా మౌనం పాటించారు. జయలలిత, శశికళలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా దినకరన్‌ అన్నాడీఎంకేకు నాయకత్వం వహిస్తారని అన్నామలై సూచిస్తుంటే, వాస్తవానికి ఆ పాత్రకు శశికళే సరిపోతారని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. "అన్నింటికంటే, ఆమె ప్రతి అంశంలో జయలలితతో సన్నిహిత బంధాన్ని పంచుకుంది. జయలలిత జీవించి ఉన్న సమయంలో కూడా పార్టీలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది."
చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో శశికళ కొత్త ఇంటిని నిర్మించడం గురించి, ఆమె జయలలితతో తన జీవితంలో గణనీయమైన భాగాన్ని గడిపినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. జయలలిత మరణం తరువాత, ఆమె ఇల్లు - వేద నిలయం - ఆమె మేనకోడలు జె దీప మేనల్లుడు దీపక్‌కు చెందాయి. శశికళ కొత్త ఇల్లు వేద నిలయం ఎదురుగానే ఉంది.
OPS-దినకరన్ లను ఎదుర్కోవడానికి పళని స్వామి తిరిగి శశికళను సంప్రదించడానికి ప్రయత్నించారని, దీనికి ఆమె లొంగలేదని పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ దీనిని రెండు వర్గాలు ఇప్పటి వరకూ ధృవీకరించలేదు. "ఎన్నికల తర్వాత వారు రాజీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఆమె వేచి చూసే విధానాన్ని అవలంబించడానికి ఇష్టపడుతుంది."
బీజేపీ కులాల లెక్కలు
ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని ముక్కులతోర్ సామాజికవర్గం ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ ఓపీఎస్-దినకరన్ ద్వయాన్ని ఆశ్రయిస్తోంది. చారిత్రాత్మకంగా, అన్నాడీఎంకే ఎక్కువగా ముక్కులథోర్ సామాజికవర్గం మద్దతుగా పరిగణించబడుతుంది, దీనికి కారణం పార్టీలో శశికళ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, పళనిస్వామి నాయకత్వాన్ని స్వీకరించినప్పటి నుంచి, పార్టీని ఆయన సామాజిక వర్గం గౌండర్ పార్టీగా చూస్తున్నారు. ముక్కుల థోర్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా తిరిగి వారి మద్దతును పొందేందుకు పళనిస్వామి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో శశికళ మద్దతు ఇచ్చే ఏ సూచన అయినా అన్నాడీఎంకే స్థానానికి బలం చేకూర్చవచ్చు.
ఏఐఏడీఎంకే పటిష్టత
అన్నామలై ప్రకటన రాజకీయ అపరిపక్వతను ప్రదర్శిస్తుందని, తమిళనాడు రాజకీయాలపై అవగాహన లేమిని వెల్లడిస్తుందని సీనియర్ జర్నలిస్ట్ దురై కరుణ అన్నారు. ఆయన అన్నాడీఎంకే ఆవిర్భావం నుంచి విస్తృతంగా ఆ పార్టీ విషయాలను గమనిస్తున్నారు. "ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలితే రాజీ తప్పదని సూచించారు."
"ఏఐఏడీఎంకే పుట్టి, ఎదిగిన విధానం, ఎంజీఆర్, జయలలిత వంటి మహోన్నతమైన నాయకులు ఉన్నారని, అన్నామలైకి దాని గురించి ఏమైనా క్లూ ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అలాంటి నాయకులు ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకే ఎప్పుడూ క్యాడర్‌తో నడిచే పార్టీ" అని దురై కరుణ అన్నారు. ఎఐఎడిఎంకె ప్రారంభించిన వెంటనే ఎంజిఆర్ ప్రసంగం గురించి కరుణ ఒక క్షణం గుర్తు చేసుకున్నారు, "ఎఐఎడిఎంకె విధి కేవలం రామచంద్రన్ భుజాలపైనే ఉందని ప్రజలు ఊహించారు" అని కరుణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "కానీ MGR ఈ భావనను ప్రతిఘటించారు, 'మూర్ఖులారా, ఒక రామచంద్రన్ పోయినట్లయితే, అది అన్నాడీఎంకేకు ముగింపు పలకదు. అది వెయ్యి సంవత్సరాలు ఉంటుంది' అని ప్రకటించారు."
సంస్థాగత నిర్మాణం
అట్టడుగు యూనిట్ల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వ పాత్రల వరకు విస్తరించి ఉన్న ఏఐఏడీఎంకే సంస్థాగత నిర్మాణం పూర్తి పరిమాణం, రాష్ట్రంలో బీజేపీ మొత్తం సభ్యత్వాల సంఖ్యను పదిరెట్లు తగ్గించిందని కరుణ అన్నారు. "అలాగే, ఏఐఏడీఎంకే ఓటర్ల సంఖ్య బీజేపీ కంటే 15 రెట్లు ఎక్కువ. పార్టీ ఉనికిని కోల్పోతుందని అన్నామలై చెప్పడం తమిళనాడుపై ఆయనకున్న అవగాహన, రాజకీయ పరిజ్ఞానాన్ని వెల్లడిస్తుంది." కరుణ అన్నాడీఎంకే చరిత్రలో ఒక క్లిష్టమైన కాలాన్ని ఎత్తిచూపారు, MGR అనారోగ్యంతో మరణించిన తర్వాత నాయకత్వ శూన్యతను అనుభవించిందని గుర్తు చేసుకున్నారు. ''పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగేందుకు జయలలిత ఈ కాలంలో నేర్పుగా ఎత్తులు వేశారు. 1989 ఎన్నికల తర్వాత జయలలిత, జానకీ రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) నేతృత్వంలోని వర్గాలు విలీనమయ్యాయి. ఈ ఎన్నికల తర్వాత కూడా అలాంటి ప్రయత్నమే జరిగే అవకాశాలు ఉన్నాయి’’ అని కరుణ అన్నారు. అన్నామలై సూచించినట్లుగా ఓపీఎస్, టీటీవీకి క్యాడర్ ఆటోమేటిక్‌గా మద్దతు ఇస్తుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు.
'ఎఐఎడిఎంకెను తొలగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది'
“ఏఐఏడీఎంకే కార్యకర్తలు డీఎంకేను సమర్ధవంతంగా ఎదుర్కొని, బీజేపీ పురోగతిని అడ్డుకోగల నాయకుడిని ప్రధానంగా కోరుకుంటారు. కజగం (AIADMK, DMK) లేని తమిళనాడు గురించి BJP వాక్చాతుర్యం గుర్తుందా? ఎఐఎడిఎంకెకు బిజెపి చేస్తున్నది దృతరాష్ట్ర ఆలింగనం వంటిది " అని కరుణ అన్నారు.
"ముఖ్యంగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గాన్ని ఇతరులకు వ్యతిరేకంగా నిలబెట్టడం, ఏఐఏడీఎంకేను బలహీనపరచడం, చివరికి పూర్తిగా నిర్మూలించడం బీజేపీ లక్ష్యం. కానీ తమిళనాడులో అలాంటి వ్యూహాలు పని చేసే అవకాశం లేదు," అన్నారాయన. ఎఐఎడిఎంకెను అణగదొక్కడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను పళనిస్వామి గ్రహించినట్లు తెలుస్తోంది. అన్నామలై వ్యాఖ్యలపై స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన (అన్నామలై) రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు కూడా నిండలేదు. ఆయన అన్నాడీఎంకేను నిర్మూలిస్తానని చెప్పుకుంటున్నారు.. అని సేలంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పళనిస్వామి విమర్శించారు. "ఎఐఎడిఎంకె అతనిలాంటి అనేక మంది వ్యక్తులను ఎదుర్కొంది. ఎఐఎడిఎంకెను నిర్మూలించడానికి ప్రయత్నించే వారు తమను తాము నిర్మూలించుకుంటారు." అని వాగ్భణాలు సంధించారు.

'అన్నామలై ఒక విదూషకుడు'

అన్నామలైని 'పబ్లిసిటీ-సీకర్', 'అటెన్షన్-గ్రాబర్', 'విదుషకుడు' అని లేబుల్ చేస్తూ  ఏఐఏడీఎంకేలో నాయకులు తీవ్రంగా విమర్శించారు. "అన్నామలై, తన IPS నేపథ్యంతో, డిప్యూటేషన్‌పై రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతంలో చాలా మంది వ్యక్తులు అన్నాడీఎంకే నుంచి వైదొలిగారు, ఆ తర్వాత మరుగున పడిపోయారు.

అయితే, ఏఐఏడీఎంకే పట్టుదలతో ఉంది, ఐక్యంగా ఉంది. ఈ చారిత్రక సందర్భాన్ని అన్నామలై విస్మరించినట్లు తెలుస్తోంది. అని అన్నాడీఎంకే సీనియర్ నేత కదంబూర్ రాజ్ ఇటీవల విలేకరులతో అన్నారు.నిరంతరం మారుతున్న ఎన్నికల దృశ్యంలో, డిఎంకె, ఎఐఎడిఎంకె ఆధిపత్యం చెలాయించిన కాలం తర్వాత యుద్దభూమి మరోసారి ఎఐఎడిఎంకె -బిజెపిల మధ్య ముఖాముఖిగా మారింది. ఎఐఎడిఎంకె-బిజెపి తమను తాము మరోసారి నిరూపించుకోవాలని ఈ ఎన్నికలను వాడుకుంటున్నాయి. జూన్ 4 తరువాత ఏ పార్టీకి గ్రహణం పడుతుంది.. ఏ పార్టీకీ వీడుతుందో తెలుస్తుంది.
Tags:    

Similar News