శబరిమల బంగారం కేసు: సీపీఐ(ఎం) నేత పద్మకుమార్ అరెస్ట్

ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూతతో కూడిన రాగి పలకలు, గర్భగుడి తలుపులకు ఎలక్ట్రోప్లేటింగ్ పనిని ఉన్నికృష్ణన్‌కు అప్పగించినపుడు TDB అధ్యక్షుడిగా ఉన్న పద్మకుమార్..

Update: 2025-11-20 12:24 GMT
Click the Play button to listen to article

శబరిమల(Sabarimala) బంగారం దొంగతనం కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ గురువారం (నవంబర్ 20) అరెస్టు అయ్యారు. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఎడిజిపి హెచ్. వెంకటేష్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం మొదట్లో కస్టడీలోకి తీసుకున్న మరో TDB మాజీ అధ్యక్షుడు ఎన్ వాసును కూడా పద్మకుమార్‌తో పాటు ప్రశ్నించారు. శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం కేసులో ఇద్దరు మాజీ అధికారుల పాత్రపై దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

గురువారం (నవంబర్ 20) విలేఖరులతో మాట్లాడుతూ.. ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూతతో కూడిన రాగి పలకలు, గర్భగుడి తలుపులకు ఎలక్ట్రోప్లేటింగ్ చేసే పనిని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అప్పగించాలని బోర్డు నిర్ణయించిన సమయంలో పద్మకుమార్ టీడీబీ అధ్యక్షుడిగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో తాను బోర్డు అధ్యక్షుడి పదవిలో లేనని పద్మకుమార్ వాదించారు.

ఈ నెలలో రెండుసార్లు విచారణకు హాజరు కావాలని పద్మకుమార్‌ను కోరామని అయితే అతను మరింత సమయం కోరాడని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల మరో నోటీసు జారీ కాగానే విచారణకు హాజరయ్యాడని తెలిపారు.

కొన్నీ మాజీ ఎమ్మెల్యే అయిన పద్మకుమార్ ప్రస్తుతం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు. ఆయన పతనంతిట్ట జిల్లాకు చెందిన ప్రముఖ సీపీఐ(ఎం) నాయకుడు. కేరళ ఆరోగ్య మంత్రి, జూనియర్ నాయకురాలు వీణా జార్జ్‌ను రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా చేర్చడంపై పార్టీ నాయకత్వంతో విభేదించారు.

2019లో టీడీబీ అధ్యక్షుడిగా ఉన్న పద్మకుమార్ స్థానంలో నియమితులయిన ఎన్ వాసును సాయంత్రం వరకు సిట్ కస్టడీకి కొల్లంలోని విజిలెన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది.

బీజేపీ నిరసన..

వాసును కోర్టులో హాజరుపరిచిన సమయంలో బీజేపీ(BJP) కార్యకర్తలు కోర్టు సమీపంలో నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు నుంచి క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి ఆయనను తరలించేందుకు వచ్చిన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బంగారం పోయిన రెండు కేసుల్లో ఉన్నికృష్ణన్, వాసుతో సహా ఐదుగురిని SIT అరెస్టు చేసింది.

Tags:    

Similar News