‘పార్టీలో విభేదాలు మీడియా సృష్టే’

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్య

Update: 2025-11-20 12:54 GMT

తెలంగాణ బిజెపిలో విభేదాలు లేవని బిజెపి మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపిలో విభేదాలు సోషల్ మీడియా సృష్టే అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విభేధాలపై తెలంగాణ బిజెపి స్పందించింది. పార్టీలో క్రమశిక్షణారాహిత్యం సహేంచేది లేదని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరించారు.

మావోయిస్టులపై అమిత్ షా స్టాండ్ ఫైనల్

మావోయిస్టులపై కేంద్రమంత్రి అమిత్ షా స్టాండ్ ఫైనల్ అని ఈటెల రాజేందర్ అన్నారు. ఇటీవల మావోయిస్టులపై వివిధ సందర్బాల్లో ఈటెల మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, బ్యాలెట్ తీర్పును గౌరవించాలన్నారు. తుపాకీ ద్వారా సమసమాజం సాధ్యం కాదని ఆయన అన్నారు. కాలం చెల్లిన సిద్దాంతాలకు నూకలు చెల్లాయన్నారు. వందలాది మావోయిస్టులు లొంగుబాటు పట్టారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. యువత అడవిబాట పట్టి కుటుంబ సభ్యులకు దూరమౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్లలో అనవసరంగా చనిపోతున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ సత్పలితాలను ఇస్తోంది. ప్రభుత్వ సహాయక చర్యల కారణంగా  మావోయిస్టు పార్టీ బలహీన పడుతుందనిఈటెల అన్నారు.

Tags:    

Similar News