మక్కా ప్రమాద బాధితులకు బీఆర్ఎస్ అండ: కేటీఆర్

ఒకే కుటుంబంలోని వారు 18 మంది మరణంచడం చాల బాధాకరమని సంతాపం తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్.

Update: 2025-11-20 07:30 GMT

మక్కా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టి ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 18 మంది ఉండటం అత్యంత బాధాకరమైన విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రమాద వార్త తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కేటీఆర్.. అడిక్‌మె్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను కలిసి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ నాయకులు కొందరు జెడ్డా వెళ్లారని, భారత దౌత్య అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు వీలయినంత సహాయం చేస్తామని వెల్లడించారు. ఇటువంటి దుఃఖం మరెవరకీ రాకూడదని అన్నారు. ఇటువంటి శోక సమయంలో ఈ కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు.

అసలు ప్రమాదం ఏంటంటే

అయితే నవంబర్ 17 సోమవారం తెల్లవారుజామున మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంలోని 45మంది ప్రయాణీకులు మరణించినట్లు హైదరాబాద్ లోని హజ్ కమిటి ప్రకటించింది. మక్కా, మదీనా ప్రార్ధనాస్ధలాలను దర్శించుకునేందుకు హైదరాబాదుకు చెందిన ప్రయాణీకులు నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు తీసుకుని ప్యాకేజీటూర్లో వెళ్ళారు. మక్కాను దర్శించుకుని మదీనాకు వెళుతుండగా ముఫ్రిహత్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున అంటే భారత కాలమానం ప్రకారం 1.30 గంటలకు ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొన్నది.

ఈ ప్రమాదంలో ట్యాంకర్ లోని డీజల్ అంటుకున్నది. అలాగే ట్యాంకర్ లోని డీజల్ బస్సుమీద కూడా పడింది. ప్రమాద తీవ్రతకు బస్సు ట్యాంకులోని ఆయిల్ కూడా బయటకు రావటంతో మంటలు ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టింది. ప్రమాదం జరిగినపుడు ప్రయాణీకులందరు గాఢనిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలుసుకునేలోపే మంటల బస్సులోపలకు కూడా వచ్చేశాయి. దాంతో ప్రయాణీకులందరు మరణించినట్లు హజ్ కమిటి సభ్యులు వెల్లడించారు. మరణించిన వారిలో పురుషులు 17 మంది, స్త్రీలు 28 మంది ఉన్నట్లు హజ్ కమిటి ప్రకటించింది. మృతులంతా మల్లేపల్లి, బజార్ ఘాట్, అసిఫ్ నగర్ ప్రాంతాలకు చెందిన వారే. దీంతో పై ప్రాంతాల్లో తీవ్ర విషాధచాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News