ఐబొమ్మ మిర్రర్ సైట్‌ల మూసివేతపై పోలీసులు ఫోకస్

రవి వెబ్ సైట్లకు 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు.

Update: 2025-11-20 11:21 GMT

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. రిమాండ్ లో ఉన్న అతడిని చంచల్ గూడ జైలు నుంచి బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐదు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు 12 వ చీఫ్ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి అనుమతివ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 వేల సినిమాలను పైరసీ చేసి తన ఐబొమ్మ సైట్‌లో అప్ లోడ్ చేసి హెచ్ డి క్వాలిటీతో ప్రసారం చేసే రవిని ఇటీవలె హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవులు కేంద్రంగా తన ఇల్లీగల్ దందాకు రవి తెరలేపాడు. సినిమా విడుదల అయిన కొద్ది గంటల్లోనే ఐ బొమ్మలో రిలీజ్ కావడంతో సినీ ఇండస్ట్రీ వేల కోట్ల రూపాయలు నష్ట పోయింది. ఆరేళ్లుగా 66 మిర్రర్ వెబ్ సైట్లలో పైరసీ సినిమాలు అప్ లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. 50 లక్షల మంది డాటా సేకరించి నేరస్థులకు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. రవి చేసిన నేరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం ఐ బొమ్మ రవి వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఐ బొమ్మ రవి వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఈడీ ఓ లేఖ కూడా రాసింది. రవికి సంబందించిన డిటైల్స్ ఇవ్వాలని కోరింది. రవి ఎన్ ఆర్ ఐ అకౌంట్ కు క్రిప్టో వాలెట్ నుంచిప్రతీ నెల రూ.15 లక్షలు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇమంది రవి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు.

రవి ఉచితంగానే హెడ్ డి క్వాలిటీతో పైరసీ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. కానీ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంతో లక్షలాదిరూపాయలు సంపాదిస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడానికి తన ఐ బొమ్మ సాధనంగా మారింది. ఐ బొమ్మతో పాటు రెండు మూడు డొమైన్లను రవి నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్ సైట్లను మూసేసిన పోలీసులు మరికొన్ని మిర్రర్ వెబ్ సైట్లను మూయించలేకపోయారు. ఈ డొమైన్లను మూసేయకపోవడంతో రవి అరెస్ట్ తర్వాత ఐ బొమ్మ వన్ అనే వెబ్ సైట్ ప్రత్యక్షం కావడం కీలకంగా మారింది. మిర్రర్ వెబ్ సైట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. అవి మూసేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రవి వెబ్ సైట్లకు 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News