బండి సంజయ్, కెటిఆర్ లకు హైకోర్టులో ఊరట

వారిపై నమోదైన కేసులను కొట్టేసిన హైకోర్టు

Update: 2025-11-20 14:11 GMT

కేంద్ర మంత్రి బండి సంజయ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నతన్యాయస్థానం గురువారం కొట్టివేసింది. 2023లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ పై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్ష్యతో కేసు నమోదైందని బండి సంజయ్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు నమోదైన ఎఫ్ ఐఆర్ లో పొందుపరిచిన సెక్షన్లు, పోలీస్ దర్యాప్తులో ఆ వివరాలు లేకపోవడంతో హైకోర్టు కేసు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారి చేసింది.

2023 ఎన్నికల సమయంలో కెటిఆర్, గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టిఆర్ఎస్ ప్రయోజనాల కోసమే అమరవీరుల స్థూపం వద్ద కెటిఆర్ ను గోరటి వెంకన్న ఇంటర్వ్యూ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్ష్యతో కేసు నమోదు చేశారని కెటిఆర్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కెటీఆర్ న్యాయవాదితో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది.

Tags:    

Similar News