‘విజయ్’ ను పళని స్వామి ప్రలోభ పెడుతున్నారా?
ఎన్డీఏ కూటమిలో ఎవరైన రావచ్చని ఎందుకన్నారు?
ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార డీఎంకేను గద్దె దించడంపై ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు అన్నాడీఎంకే కూటమిలో చేరవచ్చని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామి సోమవారం పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేను ఎన్డీఏలో చేరమని ఆహ్వానించడంపై విలేకరులు ప్రశ్నలు అడగగా పళని స్వామి స్పందించారు.
అధికార డీఎంకేను వ్యతిరేకిస్తున్న అన్ని సారూప్య పార్టీలు అన్నాడీఎంకే శిబిరంలో చేరవచ్చని ఆయన అన్నారు. వంద రోజుల పనిని మరో 25 రోజులు కేంద్రం పెంచినందుకు కేంద్రాని అభినందించే హృదయం డీఎంకేకు లేదని ఆయన చురకలంటించారు.
ఈ పథకం కింద పనిదినాలను 150 రోజులకు పొడిగిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని డీఎంకే నిలబెట్టుకుందా? వ్యవధిని పొడిగించినందుకు కేంద్రాన్ని అభినందించే ధైర్యం ఎవరికి లేదు. పేరు మార్పును అనవసరంగా తప్పు పట్టింది’’ అని మాజీ ముఖ్యమంత్రి వీబీ రామ్ జీ చట్టాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.
కుటుంబ రేషన్ కార్డులందరికి పొంగల్ గిప్ట్ హ్యంపర్ తో పాటు రూ. 5 వేల నగదు సహాయం అందించాలని పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు సేలం జిల్లాలోని ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 3.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.