రాజ్యసభ సభ్యుడిగా కమల్ ప్రమాణ స్వీకారం..
మాట నిలబెట్టుకున్న DMK..;
మక్కల్ నీది మయ్యం (MNM) చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) తో పాటు తమిళనాడు(Tamil Nadu)కు చెందిన మరో ముగ్గురు ఎంపీలు రాజాతి, ఎస్ఆర్ శివలింగం పి విల్సన్ రాజ్యసభ సభ్యులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎంపీల పదవీకాలం ఈ మధ్యే పూర్తయిన విషయం తెలిసిందే.
2024 పార్లమెంట్ ఎన్నికలలో DMKకి కమల్ మద్ధతు ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా తనను రాజ్యసభకు పంపుతామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు జూన్ 12న తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తమిళనాడుకు రాజ్యసభలో మొత్తం18 సీట్లు ఉన్నాయి. వీటికి DMK, AIADMK, కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, మరో కేంద్ర మాజీ మంత్రి GK వాసన్ కూడా తమ పార్టీల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.