యూపీఐతో కేంద్రమంత్రిని ఫిదా చేసిన ఆటో డ్రైవర్.. ఏం చేశాడో తెలుసా ?
రోజువారీ మన జీవన విధానంలో యూపీఐ అనేది నేడు కీలకంగా మారింది. అనేక చోట్ల మనం క్యూఆర్ కోడ్ చూస్తూ ఉంటాం. అయితే బెంగళూర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఓ అడుగు ముందుకు వేసి
దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చాక మనీ ట్రాన్స్ ఫర్ చాలా సులువుగా మారింది. కూరగాయలు, ఛాయ్ వాలా, ఆటోవాలా ఇలా అన్ని ప్రదేశాల్లో యూపీఐ తో చెల్లింపులు జరుగుతున్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ ఆటో డ్రైవర్ మరో అడుగు ముందుకేసి యూపీఐ చెల్లింపులు మరింత సులువు చేశాడు.
అతని వినూత్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధానానికి కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన "UPI का swag🤘 చెల్లింపులు చాలా సులభం." అని రాసుకొచ్చారు.
UPI का swag🤘
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 21, 2024
Payments made super easy. pic.twitter.com/eBc1Fg3hOr
ఆటో డ్రైవర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీకి సంబంధించిన QR కోడ్ కస్టమర్ తన స్మార్ట్ వాచ్ స్క్రీన్‌పై స్కాన్ చేయడానికి, ఏర్పాట్లు చేసుకున్నాడు.