భాషా నైపుణ్యాల కోసం కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కార్

పాఠశాలల కోసం రూ. 19 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-26 12:04 GMT
తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్భుల్ మహేశ్

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో భాగంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 13 లక్షల మంది విద్యార్థులలో తమిళం, ఇంగ్లీష్, గణితంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి రూ. 19 కోట్ల బడ్జెట్ ను విడుదల చేసింది. దీనిని టార్గెటెడ్ హెల్ప్ ఫర్ ఇంఫ్రూవింగ్ రెమిడియేషన్ అండ్ అకడమిక్ నర్చరింగ్(థిరాన్)గా పేరు పెట్టింది.

పాఠ్యాంశాలు, సిలబస్, పాఠ్య పుస్తకాల సవరణ కోసం రూ. 7 కోట్ల ప్రారంభ నిధిని కూడా కేటాయించినట్లు విద్యాశాఖ మంత్రి అన్భిల్ మహేశ్ పొయ్యమోళీ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో పురోగతికి అనుగుణంగా ఉండేలా చూడటం, వినూత్న బోధనా పద్దతుల ద్వారా సమగ్రంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా వాతావరణాన్ని మార్చడం ఈ సిలబస్ సవరణ లక్ష్యంగా వెల్లడించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన..
రాష్ట్రంలో పాఠశాల విద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 13 కొత్త ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నారు. నాలుగు ప్రాథమిక పాఠశాలలు, 14 మధ్య తరగతి పాఠశాలలు, 20 ఉన్నత పాఠశాలల ఆధునీకరణను చేపట్టనున్నారు. పాఠకుల సౌలభ్యం కోసం 30 పాత గ్రంథాలయ భవనాలను పునర్ నిర్మించనున్నట్లు 125 గ్రంథాలయాలలో రూ. 30 కోట్ల వ్యయంతో టాయిలెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
విద్యార్థుల అభ్యాస ఫలితాలు పెంపొందించడానికి ఈ విభాగం 1.25 లక్షల మంది ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నైపుణ్య అభివృద్ది శిక్షణను రూ. 28 కోట్ల అంచనా వ్యయంతో అందించనుంది. అలాగే ప్రైవేట్ స్వయం ఫైనాన్సింగ్ ఇతర బోర్డు పాఠశాలల్లో పనిచేస్తున్న తమిళ ఉపాధ్యాయులకు వారి బోధనా నైపుణ్యాలకు మెరుగుపరచడానికి రూ. 4.94 లక్షల అంచనా వ్యయంతో శిక్షణ అందించడానికి ప్రణాళిక ఏర్పాటు చేస్తోంది.
‘పోస్కో’ అవగాహాన..
ప్రైవేట్ పాఠశాల్లోని ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బందికి పోస్కో చట్టంపై అవగాహాన శిక్షణను కూడా ఈ విభాగం నిర్వహించనుంది. అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి 6,478 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో స్మార్ట్ తరగతి గదులకు రూ. 25 కోట్ల ఫర్నిచర్ అందించనున్నారు.
పాఠశాల గ్రంథాలయాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా చూసి చదివే నైపుణ్యం పెంచడానికి నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కథ చెప్పే సెషన్ లు, పఠనం సవాళ్లు, పుస్తక క్లబ్ లు, బృంద చర్చలు, పఠన పోటీలు వంటి వివిధ కార్యకలాపాలు నిర్వహించబడతాయి.
నైపుణ్య శిక్షణ..
ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లోని 12 వేల మంది వృత్తి విద్యా విద్యార్థులకు నైపుణ్యం అందించడానికి పారిశ్రామిక శిక్షణ సంస్థలు, రాష్ట్ర నైపుణ్య కేంద్రాలను ఆధునికంగా తీర్చిదిద్దబోతున్నారు.
ఇందుకోసం రూ. 13 కోట్లను అంచనా వేశారు. పాఠశాలల్లో 46 వేల మంది విభిన్న సామర్థ్యం గల విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు వేశారు.
ఇందుకోసం క్రీడాపరికరాలు, శిక్షణకు ఏర్పాట్లు చేయబోతున్నారు. జిల్లా విద్య, శిక్షణ సంస్థ ద్వారా ఉపాధ్యాయులకు సంగీతం, నాటకంలో శిక్షణ కూడా ఇవ్వబడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా తమిళ సాహిత్యాన్ని ప్రొత్సహించడానికి ప్రఖ్యాత కవులు భారతీయార్, భారతీదాసన్ కవితలను 25 జాతీయ, అంతర్జాతీయ భాషలలోకి అనువదించడానికి రూ. 1 కోటి రూపాయాలు విడుదల చేస్తారు. 
తంతై పెరియార్ సాహిత్య సంకలనాలను మూడు సంవత్సరాలలో ఐదు సంపుటాలుగా రూ. 50 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అలాగే చరిత్రకారులు రచించిన తమిళనాడు చరిత్రపై పుస్తకాలను రూ. 30 లక్షల రూపాయలతో ప్రచురించబోతున్నారు.
వందశాతం ఫలితాలకు సత్కారం..
పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించినందుకు ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రశంసాపత్రాలతో సత్కరిస్తారు. అంతేకాకుండా ఉత్తమంగా రాణించిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల పూర్వ విద్యార్థులను ‘‘పాఠశాల రాయబారులు’’గా నియమిస్తారు.
ఇది గత సంవత్సరం కంటే కనీసం 50 మంది ఎక్కువ విద్యార్థులు పాఠశాలలో చేరితే వారికి అందిస్తారు. అలాగే ప్రశంసాపత్రాలతో సత్కరిస్తారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో రాణించిన ప్రైవేట్ స్వయం ఆర్థిక పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలు, 4.6 లక్షల విలువగల బహుమతులు అందజేస్తారు.
Tags:    

Similar News