తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు మరోసారి వార్నింగ్..
నిధులు ఇవ్వకుంటే బంద్ అనివార్యమంటూ స్పష్టం చేసిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు.
ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రైయివేట్ కాలేజీల యాజమాన్యాల యాజమాన్యాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. హామీ ఇచ్చిన్లు ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి బంద్ నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసెసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఛైర్మన్ ఎన్ రమేష్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను తెలుపుతు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుకు వినతిపత్రం అందించారు. తమకు హామీ ఇచ్చిన విధంగా రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పారు. అందుకు ప్రభుత్వానికి నవంబర్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులను 1 ఏప్రిల్ 2026 నాటికి చెల్లించాలని చెప్పారు. నవంబర్ 3న చేపట్టే బంద్‌కు సంబంధించి అక్టోబర్ 22న ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్నట్లు రమేశ్ చెప్పారు.
బంద్‌కు పిలుపివ్వడం ఇది రెండో సారి
ఈ సంవత్సరమే ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేటు కాలేజీలు బంద్‌కు పిలుపివ్వడం ఇది రెండోసారి. అక్టోబర్ 13న కూడా తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన బాట పడతామని ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ స్పష్టం చేశారు. అప్పుడు వెంటనే స్పందించిన ఎఫ్‌ఏటీహెచ్‌ఐ ఛైర్మన్ రమేష్.. సెప్టెంబర్ నెల 20, 21 తేదీల్లో బకాయిలు చెల్లిస్తామని డిప్యూటి ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హామి ఇచ్చినప్పటికీ కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేశారని అన్నారు. దీపావళి లోపు 1200 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చిందని, ఎలా ఇస్తారో తెలియజేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నిధులు రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఆందోళన బాట పట్టనున్నట్లు ప్రకటించారు.
రూ.8వేల కోట్ల బకాయిలు..
ఫీజురియంబర్స్‌మెంట్ బకాయిలపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగానే రూ.8వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపింది. ఈ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. ఇప్పటికే విద్యా మండలి ఛైర్మన్‌కు మెమోరాండం అందించాం. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కాలేజీలను బంద్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇలా కాలేజీలను బంద్ చేయడం వలల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. విద్యార్థుల భవితవ్యంపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అని గతంలోనే తమ కష్టాలను వివరించారు.