మోస్ వాంటెడ్ రియాజ్ పోలీసుల చెరలో
ఎన్ కౌంటర్ ప్రచారాన్ని ఖండించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు పాల్పడిన రియాజ్ ను పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్యపై రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రియాజ్ ను పట్టుకోవడానికి ప్రత్యేక దళాలను రంగంలో దించడమే గాక నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి 50 వేలను ప్రకటించారు. కానిస్టేబుల్ హత్య నిజామాబాద్ క్లాక్ టవర్ వద్ద శుక్రవారం జరిగింది. మోస్ట్ వాంటెడ్ రియాజ్ వాల్ పోస్టర్లు జిల్లా వ్యాప్తంగా అంటించారు. నిందితుడు ఎపికి పారిపోయినట్టు పోలీసులకు సమాచారమందింది.
సారంగాపూర్ శివారులో ఒక యువకుడిని రియాజ్ లిప్ట్ అడిగాడు. బైక్ ఉన్న వ్యక్తి రియాజ్ ను గుర్తుపట్టాడు. పట్టుకోవడానికి ప్రయత్నించడంతో రియాజ్ కత్తితో దాడికి దిగాడు. అక్కడే ఉన్న పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు..
ఎన్ కౌంటర్ వార్తల ను ఖండించిన సిపి
నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన పాతనేరస్తుడు రియాజ్ ను ఎన్ కౌంటర్ చేసినట్టు వస్తున్న వార్తలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఖండించాడు. రియాజ్ ప్రాణాలతో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. నిజామాబాద్ సిపి ఓ ప్రకటన విడుదల చేశారు. రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపినట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ప్రచారాన్నిసిపి ఖండించారు. సారంగాపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడటంతో గాయాలయ్యాడని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు, రియాజ్ కు చికిత్స కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
ఎక్కడ దాక్కున్నాడు
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత రియాజ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. నిజామాబాద్ సారంగాపూర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన లారీలో రియాజ్ తలదాచుకున్నాడు.
హత్య జరిగింది ఇలా..
కానిస్టేబుల్ ప్రమోద్ అన్న కూతురు కు అపెండిసైటిస్ జరిగింది. ప్రయివేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. పరామర్శించడానికి వెళ్లిన ప్రమోద్ కు పాత నేరస్తుడైన రియాజ్ కోసం క్లాక్ టవర్ వద్ద సిసిఎస్ పోలీసులు వెతుకుతున్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలో దిగిన ప్రమోద్ రియాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మురికి కాలువలో దూకి పారిపోవడానికి రియాజ్ ప్రయత్నించాడు. రియాజ్ ను పట్టుకున్న ప్రమోద్ తన స్కూటిపై మేనల్లుడు ఆకాశ్ సాయంతో రియాజ్ ను మధ్యలో కూర్చొబెట్టుకున్నాడు. నిందితుడు రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ పై దాడికి దిగాడు.ఈ ఘటనలో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమోద్ వెంటే ఉన్న మేనల్లుడు ఆకాశ్ పాత నేరస్తుడైన రియాజ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. నిందితుడు రియాజ్ ను పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.