గోషామహల్ బంద్కు పిలుపు.. పోలీసులు హైఅలెర్ట్
గోషామహల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నిర్మించాలనుకుంటున్న ఉస్మానియా ఆసుపత్రికి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.;
గోషామహల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నిర్మించాలనుకుంటున్న ఉస్మానియా ఆసుపత్రికి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. శుక్రవారం ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా ఆసుపత్రిని ఇక్కడ నిర్మించొద్దని, మరెక్కడైనా కట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆసుపత్రి శంకుస్థాపనకు నిరసనగా స్థానికులు, వ్యాపరస్తులు గోషామహల్ బంద్కు పిలుపునిచ్చారు. అందరూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్క టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. గోషామహల్ స్టేడియం దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వస్తున్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు స్టేడియం ఆవరణలో నిర్వహించాల్సిన సభను కూడా వాయిదా వేశారు. పలు ఏర్పాట్లు విరమించుకుని కేవలం సీఎం రేవంత్ శంకుస్థాపన కార్యక్రమం మాత్రమే నిర్వహించారు.
ఈరోజు బందు పాటించాలని గోషామహల్ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఆసుపత్రి శంకుస్థాపన నిర్ణయాన్ని సీఎం వెనక్కు తీసుకోవాలని, లేకపోతే సీఎంను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఆసుపత్రి శంకుస్థాపన పూర్తి చేశారు. గోషామహల్లో నిర్మించే ఆసుపత్రికి వేలమంది పేదలకు ఆరోగ్య ప్రధాయినిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఒకవైపు స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకత, మరోవైపు అనుకున్నది చేయాలన్న సీఎం ముక్కుసూటి తనంతో గోషామల్లో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే గోషామహల్లో స్టేడియంను కూల్చొద్దని, ఆసుపత్రిని ఇంకెక్కడైనా నిర్మించుకోవాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్యకు ఈ ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకంగానే బిక్షాటన చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే ఉస్మానియా ఆసుపత్రిని దాదాపు రూ.2,700 కోట్ల వ్యయంతో 26.30ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల భవనాలతో పాటు రెండు వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం కానుంది. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు, అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉండనున్నాయి.