గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు
హర్యానా గవర్నన్ నూ మార్చిన కేంద్రం, దత్తాత్రేయ స్థానంలో ఆషింకుమార్ ఘోష్;
తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అసోక్ గజపతిరాజుకు మంచి అవకాశం దక్కింది. గోవా గవర్నర్ గా ఆయన నియమితులయ్యారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ , గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది.
పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి గానూ, కేంద్ర మంత్రి గానూ పనిచేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగానూ అశోక్ గజపతి రాజు పనిచేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా , వివాదరహితుడుగా అశోక్ గజపతిరాజు వున్నారు.విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు.టీటీడీ బోర్డ్ ఛైర్మెన్ నియామకం టైంలోనూ ఆయన పేరు తెరమీదకు వచ్చింది.
ఇక హర్యానా గవర్నర్‌గా ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కొనసాగుతూ వున్నారు.తాజాగా ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ నియమితులు కావడంతో దత్తాత్రేయ మాజీగా మిగిలిపోనున్నారు. కొత్త గవర్నర్ గా నియమితులైన ఆషింకుమార్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.