బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన గువ్వల బాలరాజు.;

Update: 2025-08-04 14:40 GMT

కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. తనకు ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభంగా జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యమంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని వివరించారు.

‘‘మన నాయకత్వంలో నేర్చుకున్నాను, ఎదిగాను, సేవచేశాను. ఈ పార్టీ ద్వారా పొందిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా మిషన్ మాత్రం కొనసాగుతుంది. చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడం నా లక్ష్యం’’ అని రాసుకొచ్చారు. కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే తాను పార్టీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తన రాజీనామా లేఖలో గువ్వల బాలరాజు రాసుకొచ్చారు.

Tags:    

Similar News