జూబ్లి హిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో కూల్చివేతలు

హిందుత్వ వాదులు ఘటనా స్థలికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత;

Update: 2025-07-23 08:06 GMT

జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కుకు ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 41లో పెద్దమ్మ గుడి పక్కన సుమారు రెండు ఎకరాలు జీహెచ్‌ఎంసీ పార్కు స్థలం ఉంది. దానిని అనుకుని అవసరాల రుక్మాంగదరావు అనే వ్యక్తికి 1000 గజాలకి పైగా ప్లాట్‌ ఉంది. దీనిలో 200 గజాల విస్తీర్ణంలో ఇంటిని కే.శ్రీనివాస్‌ అనే వ్యక్తికి పదిహేనేళ్ల క్రితం కిరాయికి ఇచ్చాడు. కాగా పెద్దమ్మగుడిని అనుకుని సుమారు రూ.200కోట్ల విలువైన రెండు ఎకరాల జీహెచ్‌ఎంసీ పార్కు స్థలం ఉంది. ఆ స్థలంలోకి వెళ్లడానికి దారి లేదు. గతంలో 30 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉండేది. అయితే రుక్మాంగదరావు నుంచి ఇంటిని అద్దెకు తీసుకున్న శ్రీనివాస్‌ ఇంటిముందున్న ఖాళీ స్థలంతో పాటు నాలాను సగం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఆ పార్కులోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా ప్రహరీ నిర్మించుకుని సొంతంగా వాడుకుంటున్నారు.



Tags:    

Similar News