NTR 100 Feet Statue|హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం

ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తే తమ పనులు మొదలుపెడతామని రిక్వెస్టుచేసినట్లు మోహనకృష్ణ చెప్పారు.;

Update: 2024-12-20 05:12 GMT
100 Feet NTR Statue

అన్నగారి అభిమానులు, తెలుగుదేశంపార్టీ నేతలు, క్యాడర్ కు ఫుల్లు జోష్ కలిగే వార్త. అదేమిటంటే హైదరాబాద్ లో 100 అడుగుల విగ్రహం ఏర్పాటు విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించాడు. విగ్రహం ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు విషయమై మాట్లాడేందుకు రేవంత్(Revanth) తో ఎన్టీఆర్(NTR) కొడుకు మోహన కృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్(NTR Literature) కమిటి ఛైర్మన్ టీడీ జనార్ధన్, సభ్యుడు మధుసూదనరాజు భేటీఅయ్యారు. రేవంత్ తో లిటరేచర్ కమిటీ భేటీని ఏర్పాటుచేసింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భేటీలో హైదరాబాద్(Hyderabad) లోని ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) సమీపంలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం(NTR 100 Feet Statue) ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు మోహన్ కృష్ణ చెప్పారు. అలాగే నాలెడ్జీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కమిటి డిసైడ్ చేసినట్లు రేవంత్ తో చెప్పారు. అందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించాలని రిక్వెస్టు చేశారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతు తాము రేవంత్ తో భేటీ అయిన విషయాన్ని కమిటి చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తే తమ పనులు మొదలుపెడతామని రిక్వెస్టుచేసినట్లు మోహనకృష్ణ చెప్పారు. భూ కేటాయింపు విషయంలో రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలిపారు. నిజానికి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఆలోచన టీడీపీలో చాలాకాలంగా ఉంది. అందుకు అనువైన స్ధలాన్ని కూకట్ పల్లి ప్రాంతంలోనే చూడాలని కూడా ఒకపుడు కమిటి అనుకున్నది. అయితే వివిధ కారణాల వల్ల కూకట్ పల్లి ప్రాంతంలో కన్నా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో అవసరమైన భూమిని అడగాలని కమిటి అనుకున్నది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ కొడుకు మోహనకృష్ణ ఆధ్వర్యంలో కమిటి ఛైర్మన్, సభ్యుడు రేవంత్ ను కలిశారు.

Tags:    

Similar News