‘జూబ్లి’ ఉప ఎన్నికలో 100 మంది రౌడీషీటర్లు బైండోవర్

స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు

Update: 2025-10-23 10:41 GMT

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ వచ్చే నవంబర్ పదకొండో తేదీన జరుగనుంది. ఇప్పటికే నామినేషన్ పూర్తయ్యింది. పరిశీలన కూడా పూర్తి అయ్యింది. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని మమ్మురం చేశారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలోజరపడానికి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రౌడీషీటర్స్ బైండోవర్

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో టోలిచౌకి, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లిహిల్స్, మధురానగర్, బోరబండ, మధురానగర్, పంజాగుట్ట, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో నేరాలను అరికట్టడానికి రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.

జూబ్లిహిల్స్ లో మొత్తం 100 మంది రౌడీషీటర్లు ఉన్నారు. సహజంగా ఎన్నికల సమయంలో రౌడీషీటర్లను బైండోవర్ చేస్తుంటారు. న్యాయస్థానం ముందు హామి పత్రంపై వారు సంతకం చేయాలని పోలీసులు కోరతారు. రౌడీషీటర్లు బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

రౌడీషీటర్లు సత్ ప్రవర్తనతో మెలగడం వల్ల నేరాలను నిరోధించవచ్చు అనేది బైండోవర్ ముఖ్యోద్దేశ్యం.

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే అడుగడుగునా పికెటింగ్ ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులపై నిఘా పెట్టారు.రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రౌడీ షీటర్లపై నిఘా పెట్టి కేసులు నమోదుచేస్తున్నారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, బహిరంగ సభల్లో బైండోవర్ అయిన రౌడీ షీటర్లపై గట్టి నిఘా పెట్టారు.జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల పరిధిలో మొత్తం 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 57 సమస్యాత్మకమైనవని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రౌడీషీటర్లపై నిఘా పెరిగింది.

Tags:    

Similar News