మక్తల్ లో 12 ఏళ్ల బాలిక సజీవ దహనం

కళ్లు లేకపోవడంతో తప్పించుకోలేకపోయింది;

Update: 2025-07-13 12:34 GMT

నారాయణ పేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మక్తల్ లో 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన బాలికకు కళ్లు కనిపించవు. మతిస్థిమితం కోల్పోయింది. తల్లిదండ్రులిద్దరూ దినసరికూలీలు కావడం ఉదయమే వెళ్లిపోయారు. వంటగదిలోకి వెళ్లిన బాలిక కళ్లు కనిపించకపోవడంతో ప్లగ్ వైర్ ను లాగింది. షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. కళ్లు కనిపించకపోవడంతో గది నుంచి వెలుపలికి రాలేకపోయింది. మంటల్లో చిక్కి అహుతి అయ్యింది. మృత దేహాన్ని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News