సంజీవ రావుపేటలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి, 50 మందికి అస్వస్థత
సంగారెడ్డి జిల్లా సంజీవ రావుపేట గ్రామంలో కల్తీ నీరు తాగి ఇద్దరు మరణించారు.బావిలోని కల్తీ నీరు తాగిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.ఈ సంఘటన కలకలం రేపింది.
By : The Federal
Update: 2024-10-12 15:52 GMT
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవ రావుపేట గ్రామంలో కలకలం రేగింది.బావిలోని కలుషిత నీరు తాగిన మహేష్, సాయమ్మ మరణించడంతో గ్రామంలో విషాదం అలముకుంది. శనివారం గ్రామంలోని బావిలోని కలుషిత నీరు తాగి బీసీ కాలనీకి చెందిన 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలో వైద్యశిబిరం
మరో ఇద్దరిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత బావిలోని నీటిని పరీక్ష కోసం అధికారులు ల్యాబ్ కు పంపించారు. రూరల్ వాటర్ సప్లయి అధికారులు రంగంలోకి దిగి సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కల్తీ నీరు తాగి అస్వస్థతకు గురవడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.