దసరా కానుకగా 42శాతం రిజర్వేషన్లు
దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్న మంత్రులు పొన్నం,వాకిటి
మాతృమూర్తికి ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరమని,అలాగే 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ మంత్రులు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.బీసీ రిజర్వేషన్ల తోనే స్థానిక ఎన్నికలకు వెళుతున్నామన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్నారు. ‘మేము ఎంతో మాకు అంతా వాటా’ అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారని,దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లలలో ఇంకా వాటా రావాలి కానీ కుదించుకొని 42 శాతం రావాలి అని అడుగుతున్నామని చెప్పుకొచ్చారు.రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారన్నారు. జయలలిత బీసీ రిజర్వేషన్లు పెంచి 9 షెడ్యూలు పెట్టినప్పుడు జయలలిత పార్టీ కేంద్రంలో అధికారంలో లేదని తెలిపారు. రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు.