పులికోసం మా కడుపు కొట్టొద్దు... గిరిజనుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా ‘బంద్' . జీవొ ఉపసంహరించుకున్న ప్రభుత్వం;

Update: 2025-07-22 03:38 GMT

-జీ రామ్ మోహన్


ప్రభుత్వం కవల్ టైగర్ రిజర్వు  తడోబా అంధారి టైగర్ రిజర్వు ల మధ్యన ఏర్పాటు చేయ తలపెట్టిన కొమరంభీం పులుల సంరక్షణ కేంద్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఆదివాసీ సంఘాలు  సోమవారం బంద్ ను పాటించాయి.

బంద్ కు సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. ఆదిలాబాద్‌ ఆర్టీసీ బస్‌ డిపో ఎదుట ఆదివాసీలు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌ వల్ల దుకాణాలు తెరచుకోలేదు. జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసిలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆసిఫాబాద్ (Asifabad), కాగజ్‌న‌గర్ (Kagaznagar) అటవీ డివిజన్ లో 339 గ్రామాలపై ప్రభావం చూపే జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్.  అయితే,  ప్రభుత్వం జీవోని రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ప్రజలను సంప్రదించలేదు

ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్) గోడం గణేష్ రిజర్వు ఏర్పాటుకు ప్రజలతో సంప్రదింపులు జరగలేదని అన్నారు. ఇది కేవలం ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయం అని చెప్పారు.

“కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పీసా లాంటి ఆదివాసి చట్టాలను, వారి అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే  కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట ప్రతిపాదన తెచ్చాయి. పులులు యిప్పుడు కొత్తగా రాలేదు. కవల్ టైగర్ రిజర్వు లో జరుగుతున్న పరిణామాలేమిటో మా ముందు వున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో అటవీ అధికారుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. అక్కడ అటవీ భూముల పేరిట పంటలు పెట్టనివ్వడం లేదు, కందకాలు తవ్వుతున్నారు, కట్టెలను కొట్ట నివ్వడం లేదు, ఆవులను మేపుకోనివ్వటం లేదు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా వున్నా కూడా ఐటిడిఏ ద్వార కూడా బోర్లు వేయనివ్వటం లేదు. పీసా, 1/70 చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానాలు చేయలేదు,” అని గణేష్ అన్నారు

అటవీ అధికారుల నాయకుల మాటలను నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు తిరిగి ఖాళీ చేసిన తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. వారికీ హామీలు యిచ్చినట్టు గా పునరావాస కేంద్రాలలో విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు కల్పించలేదు. వాళ్ళ పరిస్థితి చెరువు నుండి బటయపడిన చేపల్లా వుంది. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు పొలాలు వాళ్ళకు యిస్తాము అని చెప్పి వాళ్ళను గ్రామాల నుండి తరలించారు. అటవీ సంరక్షణ కేంద్రాలు ఆదివాసుల కోసం కానే కాదు అని అయన అబిప్రాయ పడ్డారు.

ప్రభుత్వాల నిర్ణయం వల్ల తమ అస్తిత్వం, సంప్రదాయాలు దెబ్బ తింటాయి. అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నాము అని అయన వాపోయారు.

ఈ విషయం పైన గిరిజన హక్కుల కార్యకర్త డాక్టర్ పల్లా త్రినాధరావు స్పందించారు.

"ఇప్పుడు ప్రకటించిన మొత్తం సముదాయిక అటవీ హక్కుల భూమి పైన అటవీ హక్కుల చట్టం 2006 సెక్షన్ 3(1), సెక్షన్ 5 ప్రకారం అన్ని హక్కులు గ్రామ సభలకు మాత్రమే వున్నాయి. వీరికి అటవీ సంరక్షణ, వన్య ప్రాణుల రక్షణ, జీవవైవిద్యం కాపాడే బాధ్యత వుంటుంది. వారికీ ఈ చట్టం కింద పోడు భూముల పైన హక్కు, సాముదాయిక అటవీ హక్కులు, చిన్న తరహ అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువుల మేత స్థలాలు, నీటి వనరులలో చేపలు పట్టే హక్కు అటవీ హక్కుల క్రింద గుర్తించాల్సి వుంటుంది. ఈ చట్టం వ్యక్తిగత, సముదాయానికి సంబంధించిన హక్కులను గుర్తిస్తుంది. వీటిలో చాలా ఇప్పటికే గుర్తించబడ్డాయి లేదా హామీ పడాల్సిన ఇప్పటికే కోరుకుంటున్న హక్కుగా వున్నాయి. అంతకు మునుపు ఉన్న వన్య ప్రాణి సంరక్షణ చట్టం కంటే అటవీ హక్కుల చట్టం లో ఆదివాసుల కొరకు చేసిన హక్కులకు ప్రాధాన్యత వుంటుంది,” అని త్రినాథ రావు అన్నారు.

“గ్రామా సభల నుండి అనుమతి తీసుకోకుండా ఏక పక్షంగా కొమరం భీం సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించారు. ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానివి కావు కాబట్టి యిది వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం తప్పు. ఇలాంటి ప్రకటన కేవలం ప్రభుత్వ భూములకు మాత్రమే చెల్లుతుంది. ప్రభుత్వ భూమి అయినా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం స్థానికులను సంప్రది౦చటం చట్టం ప్రకారం తప్పనిసరి అయినా కొమరం భీమ రిజర్వు విషయం లో అటవీ శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. యిది ఆ చట్టం యొక్క ఉద్దేశాలకు విరుద్దం,” అని ఆయన అన్నారు.

ఈ విషయం లో రాజకీయ పార్టీల వైఖరిపైన గణేష్ వ్యాఖ్యానిస్తూ, “ఈ విషయం పైన అన్ని పార్టీలు తప్పుడు వైఖరితో వున్నాయి. కేంద్రం లో బీజేపీ, రాష్ట్రం లో కాంగ్రెస్ వున్నా వాళ్ళ మద్యన పెద్ద తేడా లేదు. ఈ ప్రతిపాదనలు బీఆర్ఎస్ ప్రభుత్వం లో వుండగా చేసారు. వామపక్షాలు, చిరు వ్యాపారాలు మా బంద్ కు మద్దతు పలికారు. ఆర్టీసీ బస్సు లు బంద్ అయ్యాయి. కాగజ్ నగర్, కొమరం భీమ డివిజన్ ల పరిధి లో వున్న 369 గ్రామాలు ఈ జీవో వలన ప్రభావితం అవుతాయి. 1,49,288 హెక్టార్ల భూమి దీని పరిధి కిందికి వస్తుందని ప్రభుత్వ జివో లో పేర్కొన్నారు. ఇటివల ఉట్నూర్ వచ్చిన జిల్లా మంత్రి జూపల్లి క్రిష్ణా రావు గారు ఈ విషయాన్నీ మంత్రి వర్గం లో చర్చిస్తామని చెప్పారు. మినిస్టర్ సీతక్క, అటవీ మంత్రి కొండా సురేఖ మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు ఈ జివో ను రద్దు చేయాలనీ విజ్ఞప్తి చేసారు.”

 టైగర్ రిజర్వు లో వ్యవసాయ భూమి లేదు...

ఈ విషయం పైన తమ వివరణ కోరగా ఆసిఫాబాద్ జిల్లా ఐఎఫ్ఎస్ అటవీ అధికారి టి. నీరజ్ కుమార్ మాట్లాడుతూ టైగర్ రిజర్వు లో వ్యవసాయ భూమి లేదు అని అన్నారు,.     “ గిరిజన నేతల మాటలు రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు,’ అని అన్నారు. 

"అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు అన్ని హక్కులు వుంటాయి. వాళ్ళ భూములకు, ఇళ్లకు సంరక్షణ వుంటుంది. మా జిల్లా లో గిరిజనులకు 80,000 ఎకరాలకు హక్కు పత్రాలు వున్నాయి. యిక్కడ గిరిజనేతరులకు ఒక లక్ష ఎకరాల దాక వున్నాయి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కొందరికి 30 నుండి 40 ఎకరాలు కూడా వున్నాయి. ఈ ప్రతిపాదిత రిజర్వు లో రెవిన్యూ భూమి లేదు. యిది అటవీ భూమి మాత్రమే. ఇందిరా సౌరగిరి జల వికాస్ యోజన క్రింద ఇరవై వేల సొర శక్తి తో నడిచే బోర్లు వేస్తున్నాము. అన్ని హక్కులకు రక్షణ వుంటుంది," అని త్రినాథ రావు అన్నారు.

2012 లో గుర్తించబడిన కవల్ పులుల సంరక్షణ కేంద్రం లోని గిన్నెదారి, జోడేఘాట్ ల లో అన్ని హక్కులు గుర్తించబడుతున్నాయి. పశువులను మేపుకునే హక్కు, చిన్న తరహ అటవీ ఉత్పత్తుల సేకరణ హక్కు అన్ని అక్కడి గిరిజనులు అనుభవిస్తున్న విషయాలను ఆయన గుర్గు చేశారు.

ప్రతిపాదిత ఈ పులుల సంరక్షణ కేంద్రం ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అటవీ డివిజన్ ల లో 1,49,288.48 హెక్టార్ల లో విస్తరించి వుంటుంది. యిందులో 78 రిజర్వు అటవీ బ్లాకుల వుంటాయి. వీటి పరిధి ప్రతిపాదిత రిజర్వు సరిహద్దుల తో సరిగ్గా సరిపోతుంది అని ప్రభుత్వం విడుదల చేసిన జివో పేర్కొంది. అయితే, గిరిజనుల ఆందోళన వల్ల వివాదాస్సదమయిన ఈ జీవోని ఉపసంహరించుకున్నారు.

Tags:    

Similar News