కల్తీ పాల రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ మేడిపల్లిలో విషపూరిత రసాయనాలతో పాల విక్రయాలు;
మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌లో కల్తీపాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ , 19 గ్యాన్‌స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేస్తున్న గంగలపూడి మురళీకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.
సంపూర్ణ ఆహారం పాలు అనేది పాత మాట. అవే పాలు తాగి అనారోగ్యానికి గురవుతున్నవారు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నారు. కాదేది కల్తీ కనర్హం . పాలల్లో కల్తీ అనేది సర్వ సాధారణమైంది. హైదరాబాద్ మహానగరంలో కల్తీ పాలు యదేచ్చగా విక్రయాలు జరుగుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూడటంతో కల్తీ పాల వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.