చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ ప్రతినిధుల బృందం ఫిదా
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ అందాలను చూసిన ఆఫ్రికన్ల బృందం మంత్రముగ్ధులైంది.;
హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన ఆఫ్రికన్ దేశాల కంటెంట్ క్రియేటర్ల బృందం పురాతన చార్మినార్ అందాలను చూసి ఫిదా అయ్యారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరానికి చిహ్నంగా నిలిచిన చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ డెలిగేట్ లు ముగ్ధులయ్యారు.కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికన్ దేశాల కంటెంట్ క్రియేటర్ లు ఆదివారం హైదరాబాద్ కు వచ్చారు. వారి పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట లను సందర్శించారు.ప్రొఫెసర్ సాయి గైడ్ గా వ్యవహరించి హైదరాబాద్ పురాతన స్థలాల విశిష్ఠత గురించి వివరించి చెప్పారు.చార్మినార్ వద్ద ఆఫ్రికన్ ప్రతినిధుల బృందం గంటకు పైగా ఉండి పరిశీలించారు. మొదటి అంతస్తు నుంచి చార్మినార్, నగర అందాలను వీక్షించారు. చార్మినార్ నిర్మాణ నేపథ్యం అంశాలను తెలుసుకొని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ కెమెరాల్లో చార్మినార్ అందాలను నిక్షిప్తం చేశారు.
సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన
ఆఫ్రికన్ ప్రతినిధులు అనంతరం సాలార్ జంగ్ మ్యూజియం ను సందర్శించారు.సాలార్జంగ్ తరాలకు చెందిన వస్తువులు,ఫర్నిచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖితప్రతులు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాల కళాకృతులు లోహపు వస్తువులతోపాటు మ్యూజియంలో భారతీయ కళలు, యూరోపియన్ పెయింటింగ్స్, మిడిల్ ఈస్టర్న్ పురాతన వస్తువులు, ఓరియంటల్ కళాఖండాలు వంటి వస్తువులను ఆఫ్రికా డెలిగేట్లు ఆసక్తిగా తిలకించారు. మనిషి బొమ్మ వచ్చి గంటలు మోగించే మ్యూజికల్ క్లాక్ ను స్వయంగా వీక్షించి వారు అబ్బురపడ్డారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోట ను ఆఫ్రికా ప్రతినిధులు సందర్శించారు. చిరుజల్లులు కురుస్తున్నా గంటన్నరకు పైగా గోల్కొండ కోట అందాలను వారు వీక్షించారు.ఆఫ్రికన్ కంటెంట్ క్రియేటర్ ల హైదరాబాద్ పర్యటన కార్యక్రమాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సమన్వయం చేసింది.
తెలుగు మూలాలున్న ఆఫ్రికా యువతి