‘అమిత్ షా.. జాతికి క్షమాపణలు చెప్పాలి’

పార్లమెంటులో రాజ్యాంగ రూపకర్త దాదాసాహెబ్ అంబేద్కర్‌ను ఉద్దేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Update: 2024-12-28 13:55 GMT

పార్లమెంటులో రాజ్యాంగ రూపకర్త దాదాసాహెబ్ అంబేద్కర్‌ను ఉద్దేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలకు అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని అమిత్ షా తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్‌లు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సమాజ్‌వాది పార్టీ ఈ అంశం దృష్టి సారించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్దేశానుసారం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో అమిత్ షా అంశానికి సంబంధించి పలు కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగానే వారు కొన్ని కీలక తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు సింహాద్రి. తార్నాకలో జరిగిన కార్యవర్గ సమావేశంలో అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగానే పార్టీ కార్యవర్గం అంతా ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

1. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన హోమ్ మంత్రి అమిత్ షా తక్షణమే భారతజాతికి క్షమాపణలు తెలపాలి.

2. జాతీయస్థాయిలో 2025 జనగణనలో కుల గణనను చేర్చి సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తుంది.

3. అఖిలేష్ యాదవ్ పిడిఏ (ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ మహిళలు) వ్యూహం ద్వారా ఉత్తర ప్రదేశ్ లో 2024 సాధారణ ఎన్నికలలో బిజెపిని ఓడించి 37 స్థానాలలో ఎంపీలను గెలిపించడంతో పార్లమెంటులో సమాజ్వాది పార్టీ మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

4. అఖిలేష్ యాదవ్ పిడిఏ వ్యూహాన్ని జాతీయస్థాయిలో విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సమాజ్వాది పార్టీ జనవరి,2025, నెల అంతా పిడిఏ చర్చ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని తీర్మానించడం అయినది.

5. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాజ్యాంగ రక్షణ ఉద్యమంలో భాగంగా పిడిఎ ను ప్రచారంలో పెట్టాలని నిర్ణయించడమైనదని తెలిపారు.

Tags:    

Similar News