ప్రీలాంచ్ పేరుతో మరో ఘరానా మోసం
బోర్డు తిప్పేసిన భారతి బిల్డర్స్;
స్వంతింటి కల నెరవేరడానికి పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన వారిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిలువునా ముంచేసింది. ప్రీలాంచ్ పేరుతో మరో ఘరానామోసం బయటపడింది. ప్రీలాంచ్ పేరుతో భారతీ బిల్డర్స్ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. భారతీ బిల్డర్స్ ఐదేళ్ల క్రితం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఇంతవరకు 25 శాతం కూడా పూర్తి కాలేదు.ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది అని కస్టమర్లు చెప్పులరిగిలా తిరిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కోట్లాది రూపాయలు కస్టమర్ల నుంచి పెట్టుబడుల రూపంలో సేకరించిన భారతీ బిల్డర్స్ చివరకు బోర్డు తిప్పేసింది. భారతీ బిల్డర్స్ ను శ్రీ భారతి ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ గా మార్చేసింది. భారతి బిల్డర్స్ ప్రారంభమైనప్పుడు ఉన్న యాజమాన్యం ప్రస్తుతం లేదు. సునీల్ అహుజాకు భారతీ బిల్డర్స్ ను అమ్మేయడంతో కస్టమర్లు సునీల్ అహుజాను అడగడం ప్రారంభించారు. అయితే సునీల్ అహుజా మాత్రం భారతీ బిల్డర్స్ తో తనకు ప్రమేయం లేదని చెబుతున్నాడు. భారతీ బిల్డర్ యాజమాన్యం మొహం చాటేయడంతో కస్టమర్లు ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు.
60 శాతం అహుజా , మిగతా 40 శాతం షేర్ తో భారతి బిల్డర్స్ అగ్రిమెంట్ చేసుకుంది. సంస్థ ప్రారంభమైన యజమాన్యం ప్రస్తుతం లేకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.భారతి బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండి శివరామకృష్ణలకు భారతి బిల్డర్స్ లో షేర్లు ఉన్నాయి. కానీ తమకు సంబంధం లేదని నాగరాజు, శివరామకృష్ణ చెప్పడంతో కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు.
భారతీ బిల్డర్స్ పూర్తిగా బోర్డు తిప్పేయడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.
సిరిసంపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పేరిట భారతీ బిల్డర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు తెగబడింది. ప్రీలాంచ్ మోసాలకు పాల్పడుతున్నరియల్ ఎస్టేట్ సంస్థలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కస్టమర్లు పోలీసులనాశ్రయించారు.
ప్రస్తుతం భారతీ బిల్డర్స్ పై సైబరాబాద్ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది.