హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? జర జాగ్రత్త

వ్యభిచారం, జూదం, బెట్టింగ్ లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఆయా భవనాలను పోలీసులు సీలు వేయాలని నిర్ణయించారు.;

Update: 2025-06-22 23:20 GMT
హైదరాబాద్ సిటీ ఏరియల్ వ్యూ చిత్రం

హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ రోడ్డులో ఉన్న ఓ అద్దె ఫ్లాట్ లో గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.అంతే సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం ఆకస్మిక దాడి చేసింది. ముగ్గురు మహిళలు, ఒక విటుడిని టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది.వ్యభిచారం సాగుుతున్న అద్దెకు తీసుకున్న ఫ్లాట్ ను సీలు వేయాలని పోలీసులు సిఫార్సు చేస్తూ సంబంధిత మండల తహసీల్దారుకు లేఖ రాశారు. పోలీసుల లేఖపై తహసీల్లారు అధ్దెఫ్లాటును ఏడాది పాటు సీలు వేశారు.


పోలీసుల హెచ్చరిక 
మీరు హైదరాబాద్ నగరంలో ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? అయితే ఆగండి...ఇటీవల హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం సిఫారసుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగించే అద్దె ఇళ్లను తహసీల్లార్ల ఆధ్వర్యంలో సీలు వేయించారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు అద్దె ఇళ్లను వినియోగిస్తే సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఆయా ఇళ్లకు సీలు వేస్తామని పోలీసులు హెచ్చరించారు.

అధిక అద్దెల ఆశతో...
కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఆస్తి యజమానులను అధిక అద్దె ఆశ చూపించి తప్పు దారి పట్టించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అద్దె ఇళ్లను ఇప్పిస్తున్నారు చాలామంది భవనాల యజమానులకు వారు అద్దెకు ఇచ్చిన తమ ఇంట్లో ఏం జరుగుతున్నదనేది తెలియదు. దీంతో పోలీసులు అద్దె ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల ఫిర్యాదుల మేరకు...
హైదరాబాద్ నగరంలో వివిధ నివాస ప్రాంతాల్లోని చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగించే భవనాలకు సీల్ చేయడం నగర పోలీసులు ప్రారంభించారు.వ్యభిచారం, బెట్టింగ్. వ్యవస్థీకృత జూదం వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు నగరంలో అద్దె ఇళ్లను ఉపయోగిస్తున్నారని నగర పోలీసుల దర్యాప్తులో తేలింది. స్థానిక నివాసితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

వ్యభిచారం, బెట్టింగ్,వ్యవస్థీకృత జూదం
హైదరాబాద్ నగరంలో వీటిని వ్యభిచారం, బెట్టింగ్,వ్యవస్థీకృత జూదం వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు ఇళ్లను ఉపయోగిస్తే అలాంటి ఇళ్లను సీజ్ చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు.స్థానిక నివాసితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏడాది పాటు ఇళ్లకు సీలు
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలిన భవనాలను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సీలు చేస్తామని రాచకొండ పోలీసులు తెలిపారు.ఆస్తి యజమానులు తమ ఆస్తిని అద్దెకు ఇచ్చే ముందు పత్రాలను ధృవీకరించాలని, కాబోయే అద్దెదారులతో నేపథ్య తనిఖీలు నిర్వహించాలని హైదరాబాద్ నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఆస్తి యజమానులు భవనం వెలుపల, కారిడార్లు, మెట్లలో సీసీటీవీ ( CCTV)లను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.

మీ భద్రతే మా ప్రాధాన్యం : పోలీసులు
మీ భద్రతే మా ప్రాధాన్యం అంటూ రాచకొండ పోలీసులు చట్టవిరుద్ధ కార్యక్రమాలను నిరోధించడానికి పకడ్బందీ చర్యలు తీసకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు నేరస్థులను పట్టుకోవడంతోపాటు అసాంఘీక కార్యకలాపాలు సాగించిన ఇళ్లకు సీలు వేసి భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధిస్తున్నారు. నేర రహిత సమాజం కోసం శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు కొత్త చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News