కరాచి బేకరీపై దాడి
బేకరీ ముందు భారత్ జెండాలను(Indian Flags) ఎగరేశారు.;
హైదరాబాదులో దశాబ్దాలుగా ఎంతో పాపులరైన బేకరీపై గుర్తుతెలీని వ్యక్తులు గురువారం దాడిచేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులకు ప్రతీకారచర్యగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బుధవారం పాకిస్ధాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపైన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనే కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి కూడా వైమానిక దళాలు వెళ్ళి ఉగ్రవాదుల స్ధావరాలను నేలమట్టంచేసేశాయి. ఈ దాడులో సుమారు వందమంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆర్మీ, వైమానిక దళాల మెరుపు దాడులకు మద్దతుగా దేశమంతటా జనాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు పెద్దఎత్తున అభినందనలు చెబుతున్నారు. అలాగే త్రివిధ దళాలకు మద్దతుగా తామున్నామంటు దేశంలోని జనాలంతా సంఘీబావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఈనేపధ్యంలో హైదరాబాదులో కూడా సంఘీబావ ర్యాలీ జరుగుతున్నపుడు గుర్తుతెలీని వ్యక్తులు కొందరు కరాచి బేకరీ(Karachi Bakery) మీద దాడులుచేశారు. అంతేకాకుండా బేకరీ ముందు భారత్ జెండాలను(Indian Flags) ఎగరేశారు. దాంతో బేకరీ యజమానులు లబోదిబోమంటున్నారు. తాము ముస్లింలము కామని, దేశ విభజనలో భాగంగా పాకిస్తాన్(Pakistan) నుండి ఇండియాకు వచ్చేసిన సింథీలమంటున్నారు. తమ ముత్తాత ఖాన్ చంద్ రమ్నాని హైదరాబాదుకు వచ్చేసి కరాచి బేకరీని మొదలుపెట్టారని యజమాని చెప్పాడు. పాకిస్తాన్ లోని కరాచి ప్రాంతంనుండి తమ ముత్తాత హైదరాబాదు(Hyderabad) వచ్చేసి బేకరి వ్యాపారం మొదలుపెట్టారు కాబట్టి గుర్తుగా బేకరీకి కరాచి బేకరి అని పేరు పెట్టుకున్నట్లు చెప్పాడు. విశాఖపట్నంలోని తమ బేకరీమీద కూడా కొందరు దాడిచేసినట్లు యజమాని చెప్పాడు. గతంలొ కూడా ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినపుడు ఇదే బేకరీపై కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దాడులు చేశారు.
కరాచి బేకరి అనే పేరుచూసి చాలామంది తాము ముస్లింలమని పొరబాటుపడ్డట్లుగా యజమాని ఇపుడు చెప్పాడు. 73 ఏళ్ళుగా తమ బేకరి విషయంలో ఎప్పుడూ తలెత్తని వివాదం ఇపుడు సడెన్ గా మొదలవ్వటం విచారకరమని యజమాని అంటున్నాడు. తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), ప్రభుత్వ యంత్రాంగం తమను కాపాడాలని విజ్ఞప్తిచేశారు. తమ బేకరీ పేరును మార్చుకోమని బెదిరింపులు వస్తున్నట్లు వాపోయాడు. తమ బేకరి పేరును మార్చుకునే విషయంలో ఎవరూ బెదిరించకుండా ప్రభుత్వమే తమను ఆదుకోవాలన్నాడు.