అజారుద్దీన్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో..?

కాంగ్రెస్ అయితే తమ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ అజారుద్దీన్ మాత్రం టికెట్ తనకే లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.;

Update: 2025-06-19 12:43 GMT

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అతి త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి ఉపఎన్నిక బరిలో ఎవరు ఉంటారు అనేది మిలియన్ డార్ల ప్రశ్నగా మారింది. అయితే ఈ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేయనున్నానంటూ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అయితే తమ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ అజారుద్దీన్ మాత్రం టికెట్ తనకే లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన.. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోటీలో కాంగ్రస్ తరపు నుంచి తానే ఉన్నానని చెప్పారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ రెండో ఇన్నింగ్స్ ఆడటానికి రెడీ అవుతున్నారని, మరి ఈ ఇన్నింగ్స్‌ ఫలితాలు ఎలా ఉంటాయో అన్న చర్చ జోరుగా మొదలైంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అజారుద్దీన్ ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో నిలబడ్డారు. కానీ ఆయనను ఓటమే పలకరించింది. అయితే తనకు ఆఖరి క్షణంలో టికెట్ ఇచ్చారని, అయినా తాను మాత్రం చిట్టచివరి వరకు పోరాడానని అన్నారు అజారుద్దీన్. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. తాను పార్టీ అభ్యన్నతి కోసం ఎంతో పనిచేశానని, అది చూసి కొందరికి కడుపు మండి తనపై తప్పుడు ప్రచారాలు కూడా చేశారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు. కావున ఈ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గం బరిలో రెండో ఇన్నింగ్స్ ఆడటానికి అజారుద్దీన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఒకసారి పోటీ చేసిన పరాజయం పాలవడంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఆయన ఉన్నారు. భారీ మెజార్టీతో గెలవాలని భావిస్తున్నారు. మరి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండో ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News