ఆలయ భూములు పరిరక్షించాలి
నిరసన చేపట్టిన భద్రాచలం రామాలయ ఉద్యోగులు;
భద్రాచలం రామాలయం భూములను ఇరు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పరిరక్షించాలని రామాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.పురుషోత్తపట్నం లో భూముల తనిఖీకి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవి,ఇతర సిబ్బందిపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు ఖండించాయి.ఆలయ భూములను ఇతరులు ఆక్రమించి అదేమిటని అడిగితే దాడులు చేయడం ఏంటన్ని ప్రశ్నించాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్ no..169 of 2022 in w.p no.4533 of 2022 dt.07.11.22 ప్రకారం పురుషోత్తపట్నం భూముల్లో ఉన్న మొత్తం 889.50 ఎకరాలు దేవస్థానంనకు అప్పగించాల్సిందిగా గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని ఆలయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సుమారు మూడు దశాబ్దాల పైబడి జిల్లా కోర్టులో, ఎండోమెంట్ ట్రిబ్యునల్ సెటిల్మెంట్ కోర్టులో . హైకోర్టులలో 250 కేసులకు పైబడి దేవస్థానానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయని , దేవస్థానం పేరున ఆన్లైన్ లో ,పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయన్నారు.పరుల చేతిలో వున్న ఆలయ భూములను కాపాడాల్సిన అవసరం అందరిపై వుందన్నారు.రామాలయం వద్ద తమ నిరసన తెలిపిన ఉద్యోగులు ,తమ పోరాటంలో మిగిలిన ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరారు.రాములవారి భూములు వున్న ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్లోకి వెళ్లడంతో పోలీసు భద్రత కూడా తమకు వుండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.