BJP | ‘బీజేపీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు’

బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకనే నేతలు తమ పార్టీవైపు చూస్తున్నారన్న రామ్‌చందర్ రావు.;

Update: 2025-08-08 12:21 GMT

బీజేపీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు సంచలన విషయాలు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో భారీ పొలిటికల్ బాంబ్ పేల్చారు. ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని, వాళ్లు ఎవరనేది అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ పార్టీలో చేరడానికి నేతలు సిద్ధమవుతున్నారు’’ అని రామ్‌చందర్ రావు చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. ఆగస్టు 10వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారని చెప్పారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం అవుతుంనది పేర్కొన్నారు. అతి త్వరలో బీజేపీలో చేరేవారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

అయితే బీఆర్ఎస్ అతి త్వరలో బీజేపీలో విలీనం కానుందన్న ప్రచారం కొన్ని రోజుల నుంచి జోరందుకుంది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలని నిశ్చయించుకున్నారని, పార్టీ విలీనం కన్నా ముందు తామే బీజేపీ చేరాలని భావించారన్న ప్రచారం కూడా మొదలైంది. అదే సమయంలో గువ్వల బాలరాజు రాజీనామా చేయడం, మరుసటి రోజే ఆడియో క్లిప్ ఒకటి వైరల్ కావడం, ఇప్పుడు బాలరాజు.. తమ పార్టీ చేరుతున్నారని రామ్‌చందర్ రావు వెల్లడించడంతో.. ఈ క్యూలో ఇంకెవరెవరు నేతలు ఉన్నారన్న చర్చలు బలంపుంజుకున్నాయి.

Tags:    

Similar News