పార్లమెంట్‌లో హెచ్‌సీయూ చర్చ

రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీధ్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని, వర్సిటీకి కేటాయించిన హూబులను కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన పేర్కొన్నారు.;

Update: 2025-04-01 09:40 GMT

కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవాహరం పార్లమెంట్‌లో కూడా వినిపించింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ ఎంపీలు కలిసి చర్చించారు. కాగా ఈరోజు జరిగిని పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ జీరో అవర్ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. ఈ అంశాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీధ్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని, వర్సిటీకి కేటాయించిన హూబులను కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా హెచ్‌సీయూకు కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని లోక్‌సభ జీరో అవర్‌లో కూడా తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు. దీంతో హెచ్‌సీయూ భూముల వ్యవహారం కేంద్రస్థాయిలో చర్చలకు దారితీస్తోంది. అయితే ఈ భూములు హెచ్‌సీయూకు చెందినవి కావని, తెలంగాణ ప్రభుత్వానికి చెందినవేనని టీజీఐఐసీ సోమవారం స్పష్టం చేసింది.

టీజీఐఐసీ ఏం చెప్పిందంటే..

2001లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 400 ఎకరాల భూములు తీసుకున్నారు. అదే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని.. ఆ సంస్థకు హెచ్‌‌సీయూ భూమిలో మరో 400 ఎకరాలను కేటాయించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ కేటాయింపులను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రత్యామ్నాయంగా వర్సిటీకి గోపన్‌పల్లి పరిధిలో 400 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతరం గోపన్‌పల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమెంటల్ రీసెర్చ్, యానిమల్ బయో టెక్నాలజీ రీసెర్చ్ కోసం 250 ఎకరాలు మంజూరు చేశారు. అదే భూమిలో టీఎస్‌జీఓ కాలనీల కోసం రోడ్డు నిర్మాణాలు కూడా చేప్పటారు.

2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్(YSR) ఐఎంజీకి భూముల కేటాయింపులను రద్దుచేశారు. దాంతో ఐఎంజీ భారత్ కోర్టులో కేసువేయటంతో వివాదం మొదలైంది. ఈ వివాదం 20 ఏళ్ళు హైకోర్టు, సుప్రింకోర్టులో నలిగి చివరకు పోయిన ఏడాది 400 ఎకరాల రద్దును సుప్రింకోర్టు సమర్ధించింది. భూమి మొత్తం ప్రభుత్వానిదే అని తీర్పిచ్చింది. కాబట్టి ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని టీజీఐఐసీ తెలిపారు. ఇప్పుడు ఆ భూములనే వేలం వేయాలని రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. కాగా మరోసారి విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.

Tags:    

Similar News