‘దమ్ముంటే రేవంత్ రాజీనామా చేయాలి’
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రజలే బుద్ధి చెప్తారు.;
తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. అందులో సందేహం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమవుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో కూడా కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు తమకు తెలియవని అన్నారు. తాను ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను అంటే పార్టీ కోసం తాను పడిన కష్టం, చేసిన కృషి ఫలితమేనని చెప్పారు. ఇది ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. కులం ఆధారంగానే తనకు ఈ పదవి వచ్చిందని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారని, అదే నిజమైతే రేవంత్‌ను రాజీనామా చేసి.. ఓ ఓబీసీ వ్యక్తికి సీఎంగా పట్టం కట్టాలని ఛాలెంజ్ చేశారు. బీజేపీ రాజకీయం అంతా కూడా అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే ఉంటుందని, వాటిని సాధించే ప్రజలను ఓటేయమని అడుగుతామని అన్నారు. తాము ఎన్నడూ కూడా ఒక కులానికో, మతానికో పెద్దపీట వేయలేదని, వెనకబడిన వారికి ముందుకు తీసుకురావడమే తమ పార్టీ మోటో అని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంనది ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకు 90 సీట్లు ఇవ్వబోతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెంపపెట్టు లాంటి బదులివ్వడానికి ప్రజలు రెడీ అవుతున్నారని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
‘‘వారిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ నెలబెట్టుకోలేకపోయాయి. ప్రతి దశలో కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశాయి. ఈ రెండు పార్టీలు కూడా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేశాయి. తమ నిస్సహాయతను సీఎం రేవంత్ రెడ్డే ఒప్పుకున్నారు. రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ సమస్య రేవంత్‌కు మాత్రం కనిపించడం లేదు. ఈ అంశంపై చర్చకు బీజేపీ సిద్ధం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. చర్చకు రావాలి’’ అని ఛాలెంజ్ చేశారాయన.
‘పార్టీ కోసం నేను చేసిన కృషికి నాకు దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు. కార్యకర్తకు దక్కిన గౌరవం ఇది. లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలబై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు.