బనకచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
అధికార కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా వుండటంతోనే తాము పోరాటం చేస్తున్నామంటున్న బీఆర్ఎస్;
By : V V S Krishna Kumar
Update: 2025-08-11 07:46 GMT
బనకచర్లపై బీఆర్ఎస్ ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని దానిపై సభలో చర్చ జరపాని అందులో పేర్కొన్నారు.బనకచర్ల నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యుడు సురేశ్‌రెడ్డి ఈ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇప్పటికే ఓసారి సభలో బనకచర్లపై వాయిదా తీర్మానం ఇచ్చిన సభ్యులు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీకి ఎలాంటి అనుమతులూ లేవని పేర్కొన్నారు.సభా కార్యకలాపాలు వాయిదా వేసి… బనకచర్లపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు.
ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అధికార పార్టీ కాంగ్రెస్ సైలెంట్ గా ఉండడంతో తాము తెలంగాణ ప్రజల తరుపున పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ఏపీ సీఎం దగ్గర తాకట్టు పెట్టి, తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.అయితే బనకచర్లను ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకొని తీరతామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. రాజకీయ లబ్ది కోసం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు.