‘జూబ్లి’ ఎన్నికల్లో బిజెపితో బిఆర్ఎస్ రహస్య ఒప్పందం

రాజీవ్ సద్బావన్ అవార్డు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

Update: 2025-10-19 10:49 GMT

మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅన్నారు. చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన్ మెమొరియల్ అవార్డు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజీవ్ సద్బావన మెమోరియల్ అవార్డును సల్మాన్ ఖుర్షీద్ కు ఇచ్చిన నిర్వాహకులను ముఖ్యమంత్రి అభినందించారు. మూడు తరాలుగా సల్మాన్ ఖుర్షీద్ కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పని చేస్తుందన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశ సమైక్యత, సమగ్రత కాపాడటానికి ఆనాడు రాజీవ్ గాంధీ చార్మినార్ నుంచే సద్బవనా యాత్ర ప్రారంభించారని రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయపదంగా నిలిచిందన్నారు. దివంగత ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు గడించారని,దేశ సమగ్రత కాపాడటానికి ఆమె ప్రాణాలర్పించారని, ఆమె బాటలోనే వెళ్లిన దివంగత రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించినట్టు ఆయన కొనియాడారు. గాంధీ అనే పేరు దేశానికి స్పూర్తినిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు. రాజీవ్ స్పూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారన్నారు.

బిజెపి బి టీం బిఆర్ఎస్

రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపికి బిటీం మారిపోయిందని, గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో బిఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందన్నారు. బిఆర్ఎస్ 21 శాతం ఓట్లు ఎవరికి చేరాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ బిజెపితో రహస్య ఒప్పందం చేసుకుందన్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News