ఫోన్ ట్యాపింగ్ కేసులో ...
సిట్ ముందు హాజరైన బిఎస్పీ నేత జానయ్య;
ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నట్లు కాంగ్రెస్ బిజెపి నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ కేసును విచారిస్తున్న సిట్ ముందు బిఎస్పీ నేత వట్టేపల్లి జానయ్య విచారణకు హాజరయ్యారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికలలో సూర్యపేట నియోజకవర్గం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు జానయ్య ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సోమవారం సిట్ అధికారులు ఆయన్నిపిలిపించుకుని విచారణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇద్దరు బిజెపి ఎంపీలైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావులను ఇప్పటికే విచారించింది. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ ప్రభుత్వం 4 , 500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీ ఆర్ ప్రోద్బలంతో ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ విచారణలో తేలింది.