బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసినందుకు సినిమా యాక్టర్ లమీద కేసులు

పైసల కోసం సినిమా యాక్టర్ల యావ;

Update: 2025-03-20 06:43 GMT
Tollywood Cine celebrities

బెట్టింగ్ ను ప్రమోట్ చేసినందుకు కొందరు  పేరు మోసిన సినిమా యాక్టర్ల మీద  తెలంగాణ   పోలీసులు కేసులు నమోదుచేశారు.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రానా దగ్గుబాటి(Rana Daggubati), మంచు లక్ష్మి(Manchu Lakshmi)తో పాటు ప్రకాష్ రాజ్(Prakash Raj), హీరోయిన్లు అనన్య నాగళ్ళ, ప్రణీత బుల్లితెర నటులు సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్ రాజన్, వసంత కృష్ణ, శోభాశెట్టి, అమృతా చౌదరి, నేహా పతాన్ తదితరులపైన పోలీసులు కేసులు నమోదుచేశారు. ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు. 

బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో 11 మంది యూబ్యూర్లపై రాచకొండ పోలీసులు కేసులు నమోదుచేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్(Betting apps) లకు ప్రమోటార్లుగా పనిచేసినందుకే 11 మంది యూట్యూబర్ల(You Tubers)పై పోలీసులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు నమోదుచేసిన కేసులపై జనాల్లో మిశ్రమస్పందన కనిపిస్తోంది. కారణం ఏమిటంటే ఇవే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన ప్రముఖ సెలబ్రిటీల(Celebrities) ను వదిలిపెట్టేసి చిన్న చిన్న వాళ్ళ మీద కేసులుపెట్టి విచారించటం ఏమిటని జనాలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల వైఖరిపై మీడియా, సోషల్ మీడియా(Social Mdia)లో కూడా వ్యతిరేకత వస్తోంది. బెట్టింగ్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లపై కేసులు నమోదు చేయద్దని, విచారించవద్దని ఎవరు అనటంలేదు. కాకపోతే పెద్దచేపలను వదిలేసి కేవలం చిన్న చేపలమీదే పోలీసులు తమ ప్రతాపాన్ని ఎందుకు చూపిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. మీడియాలో వస్తున్న ఇలాంటి ప్రశ్నలకు స్పందనగానే అన్నట్లుగా తాజాగా సినీ సెలబ్రిటీలపైన కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. 

 ఈ వత్తిడితో పోలీసుల సినిమాయాక్టర్ల మీద పడ్డారు. 

భారతీయ న్యాయ సంహిత చట్టాలు  318 (4), 112 r/w 49 తో పాటు, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు, 3, 3 (A), 4; 2008 ఇన్ ఫర్మేషన్ యాక్ట్ లోని 66D ప్రకారం వారి మీద కేసులు  బుక్ చేశారు.

ప్రకాశ్ రాజ్ స్పందన

"ఈ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వేల లక్షల రూపాయలు చేతులుమారుతున్నాయి. ఈ వ్యసనం   చాలా కుటుంబాలను, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది" అని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.

ఎఫ్ ఐ ఆర్ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, తానెపుడో 2015 లో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో పాల్గొన్నానని, అయితే, మరుసటి ఏడాదే దాన్ని మానేశానని అన్నారు. ఎఫ్ ఐ ఆర్ సేకరించిన  తర్వాత పూర్తి స్పందన ఉంటుందని ఆయన అన్నారు.

 

రానా ఏమన్నారంటే...

మరొక వైపు రానా నుంచి కూడా స్పందన ఒకటి టీమ్ రానా పేరుతో విడుదలయింది.

“రానా స్కిల్ బేస్డ్ గేమ్ యాపనకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. అది కూడా కొన్ని ప్రాంతాల వరకే ప్రసారమైంది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి లీగల్ టీమ్ ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాతే, రానా ఆ ప్లాట్ఫామ్క ప్రచారం చేయడానికి అంగీకరించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు ఈ ఆన్లైన్ గేమ్లను గుర్తించింది. ఈ గేమ్లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, అందకు చట్టబద్ధంగా అనుమతించినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదు," అని టీమ్ రానా పేర్కొంది.

సోషల్ మీడియాలో బెట్టింగ్ ను ప్రమోట్ చేయటం ద్వారా అమాయకులను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నట్లు యూట్యూబర్లు, సినీ సెలబ్రిటీలపైన చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ఇదే విషయమై మార్చి 17వ తేదీన వినయ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలందరిపైనా కేసులు నమోదుచేసి యాక్షన్ తీసుకోవాలన్న ఫిర్యాదు అందటంతోనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీయటంతో పోలీసులకు బాగా సెగతగిలింది. అందుకనే సెలబ్రిటీలందరిపైనా కేసులు నమోదు చేస్తున్నారు.

Tags:    

Similar News