ధర్నా చౌక్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ధర్నా..నేడే

ధర్నా చౌక్ ను కెసిఆర్ విధించిన ఆంక్షలనుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విముక్తి చేశాక తొలి ధర్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కావడం విశేషం.

Update: 2023-12-22 02:21 GMT
Revanth Reddy

అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీసుకున్న గొప్ప ప్రజాస్వామిక నిర్ణయం హైదరారాబాద్ ఇందిరా పాక్ వద్ద ఉన్న ధర్నచౌక్ కు విముక్తి. అక్కడ ఎవరైనా నిరసన తెలియచేయవచ్చని, నిరసన మీద ఆంక్షలు లేవని ప్రకటించారు. అంతేకాదు, పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి ప్రదర్శనలకు ఆహ్వానం పలికారు.

ఇలా హైదరాబాద్ ధర్నా చౌక్ ప్రజాస్వామికం అయ్యాక తొలిధర్నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు యే నాయకత్వం వహించడం విశేషం.

ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంది.

పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను ‘అక్రమంగా, అప్రజాస్వామికం’గా సస్పెండ్ చేశారంటూ  ఇండియా కూటమి చేపట్టిన దేశవ్యాపిత నిరసనలో భాగంగా నేడు ధర్నచౌక్ వద్ద ధర్నా జరపాలని తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు, సీనియర్ నాయకులు ధర్నాలో పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెశిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

పార్లమెంట్ లో డిసెంబర్ 13వ తేదీన ఆగంతకులు చొరబడి పొగ బాంబులు వేసిన అంశంలో హోమ్ మంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నదని దీనిని ఖాతరు చేయకుండా, డిమాండ్ చేస్తున్న

ఇండియా కూటమి లోక్ సభ, రాజ్యసభ లలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని, అందుకే నిరసన అని గౌడ్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ధర్నామలో భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో లాగానే అన్ని జిల్లా కేంద్రాలలో ఇండియా కూటమి తో కలిసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తారని కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News