పెట్టుబడుల వేటకు సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి ముహూర్తం ఖరారైంది.

Update: 2024-07-19 10:33 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3 వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం బృందం అమెరికా బయలుదేరనున్నారు. తెలంగాణ లో పెట్టుబడుల వేటకే రేవంత్ టీమ్ అమెరికా వెళ్తున్నారు. అమెరికా లోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యటనలు జరపనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. టూర్ ముగించుకుని తిరిగి ఆగస్టు 11న రాష్ట్రానికి రానున్నారు.

రేవంత్ దావోస్ పర్యటన

ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకి వెళ్లిన విషయం తెలిసిందే. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్... పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.

వివిధ ఫోరమ్ లలో మాట్లాడిన సీఎం... చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్, దుబాయ్, లండన్ వంటి దేశాల్లోనూ రేవంత్ పర్యటించారు. మూసి నది ప్రక్షాళన కోసం లండన్ లోని థేమ్స్ నదిపై అధ్యయనం చేశారు. పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ నది పాలకమండలి అధికారులు, నిపుణులతో భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను వారితో చర్చించారు.    

Tags:    

Similar News