కాగ్నిజెంట్ లో 15 వేల ఉద్యోగాలు

తొందరలోనే 15 వేలమందికి ప్రపంచంలోనే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది. ఈ మేరకు కంపెనీ సీఈవో రవికుమార్ ప్రకటించారు.

Update: 2024-08-06 05:38 GMT
Revanth and Cognizant CEO

తొందరలోనే 15 వేలమందికి ప్రపంచంలోనే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది. ఈ మేరకు కంపెనీ సీఈవో రవికుమార్ ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంతో అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రేవంత్ తో కాగ్నిజెంట్ సీఈవో భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే రేవంత్ ఆహ్వానం ప్రకారం హైదరాబాద్ లో రెండో సెటర్ ను ఏర్పాటు చేయటానికి రవికుమార్ అంగీకరించారు. తమ రెండో సెంటర్ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. రెండో సెంటర్ ద్వారా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించిబోతోందన్నారు. 10 లక్షల చదరపు అడుగుల ఆఫీసు సీటింగ్ కెపాసిటి 20 వేలమందికి సరిపడా ఉన్నప్పటికీ 15 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

రెండో సెంటర్ ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ లాంటి అత్యిధునిక సాంతికేతికతలపై దృష్టిపెట్టబోతున్నట్లు సీఈవో ప్రకటించారు. ఇది గనుక సాకారమైతే రేవంత్ అమెరికా ప్రకటన సక్సెస్ అయినట్లే అనుకోవాలి. అయితే కాగ్నిజెంట్ రెండో సెంటర్ ఏర్పాటు నిర్వణయానికి పునాధి దావోస్ సమావేశంలోనే పడింది. గతంలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు దావోస్ లో జరిగింది. అప్పట్లోనే రేవంత్-రవికుమార్ భేటీ అయ్యారు. ఆ భేటీలోనే హైదరాబాద్ లో రెండో సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. అప్పటి చర్చల ఫలితమే ప్రస్తుత నిర్ణయంగా భావించాలి.

కాగ్నిజెంట్ గనుక రెండో సెంటర్ను ఏర్పాటుచేస్తే ఇదే దిశగా మరిన్ని ప్రముఖ కంపెనీలు మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, గూగుల్, టీసీఎస్, విప్రో హైదరాబాద్ లో విస్తరణపై దృష్టిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం అనుకుంటోంది. కాగ్నిజెంట్ సీఈవోతో భేటీలో రేవంత్ మాట్లాడుతు రెండో సెంటర్ ఏర్పాటు తర్వాత తెలంగాణాలో టైర్ 2 సెంటర్లయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో సెంటర్ల ఏర్పాటుపైన కూడా దృష్టిపెట్టాలని రిక్వెస్టుచేశారు. అందుకు రవికుమార్ సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే పద్దతిలో మిగిలిన కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తే ద్వితీయ శ్రేణి నగరాలు కూడా డెవలప్ అవటంతో పాటు హైదరాబాద్ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఇప్పటికే చిన్నా, పెద్దా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సుమారు 9 లక్షలమంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. ఈ కంపెనీల ఆధారంగా మరిన్ని లక్షలమంది రకరకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లోని ఉద్యోగులను దృష్టిపెట్టుకుని వందలాది హోటళ్ళు, రెస్టారెంట్లతో పాటు వేలసంఖ్యలో టిఫిన్లు అమ్ముకునే తోపుడుబండ్లు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు అనేక షాపింగ్ సెంటర్లు, మాల్స్, రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. మొత్తంమీద కాగ్నిజెంట్ హైదరాబాద్ లో రెండో సెంటర్ను ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించటం సంతోషమే.

Tags:    

Similar News