తెలంగాణాలో కూడా ఏపీ వాలంటీర్ వ్యవస్ధ

ఏపీలో సూపర్ హిట్టయిన వాలంటీర్ వ్యవస్ధను తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అమలుచేయబోతోంది.

Update: 2024-05-02 03:31 GMT
AP Volunteer system

ఏపీలో సూపర్ హిట్టయిన వాలంటీర్ వ్యవస్ధను తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అమలుచేయబోతోంది. ఇప్పటికే ఏపీ వాలంటీరీ వ్యవస్ధ పనితీరును చాలా రాష్ట్రాలు, బ్రిటీష్ పరిశీలకులు కూడా ప్రత్యక్షంగా చూసి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యవస్ధను వచ్చే జూలై నెలనుండి తెలంగాణాలో కూడా అమల్లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో వాలంటరీ వ్యవస్ధను తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ వాలంటీర్ల ద్వారానే అందించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.

వాలంటీర్ల ద్వారా పథకాలు అందచేస్తే నిజమైన అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతినెలా వాలంటీర్ కు రు. 10 వేలు వేతనం ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసిందన్నారు. వాలంటీర్ వ్యవస్ధను జూలైలోనే అమల్లోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. ఏపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల రూపంలో అమలుచేస్తున్న అనేక సంక్షేమపథకాలను వాలంటీర్ల ద్వారానే అర్హులందరికీ అందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను ఇన్చార్జిగా పెట్టి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతుతన్నాయా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం మానిటర్ చేస్తోంది. ఎక్కడైనా అర్హులకు పథకాలు అందటంలేదని ఫిర్యాదు వస్తే వెంటనే అధికారులు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడి పథకాలు అందేట్లు చేస్తున్నారు.

అలాగే ప్రతి ప్రభుత్వ సమాచారాన్ని వాలంటీర్ 50 ఇళ్ళకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే 50 ఇళ్ళలో వాలంటీర్ కూడ అంతర్భాగం అయిపోయారు. వాలంటీర్ లేనిదే ఇళ్ళవాళ్ళు అవసరాలు తీర్చుకోలేని స్ధితికి వచ్చేశారు. ప్రతినెలా మొదటిరోజున తెల్లవారుజామునే వాలంటీర్లు 66 లక్షల మందికి పెన్షన్లు అందించటం అన్నది నిజంగానే ఒక అద్భుతమని చెప్పాలి. రేషన్ రావటంలేదన్నా, మున్సిపాలిటీలో పనికావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇళ్ళపట్టాలు అందాలన్నా ఇలా ఏ విషయాన్ని వాలంటీర్లతో చెప్పినా లేదా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళితే వెంటనే పనైపోతోంది. అంతలా పాపులరైన వాలంటీర్ల వ్యవస్ధను తెలంగాణా ప్రభుత్వం అమలు చేయాలని డిసైడ్ చేసింది. కాకపోతే వాలంటీర్ వ్యవస్ధ విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించలేదంతే.

Tags:    

Similar News