నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
వివాహేతర సంబంధమే కారణం;
నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రెండురోజుల క్రితం కనిపించకుండా పోయిన 48ఏళ్ల దామోదర్ గౌడ్ హత్యకు గురయ్యాడు. ఓ రిజర్వాయర్ లో శవమై తేలాడు. అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగినట్టు తెలుస్తోంది.
కనిపించకుండా పోయిన తన భర్త గూర్చి దామోదర్ భార్య పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్వకోల్ గ్రామానికి చెందిన దామోదర్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళతో గడపడానికి రెండ్రోజుల క్రితం వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ మహిళతో గడుపుతున్న సమయంలో భర్త , కొడుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దామోదర్ ను ఆ మహిళ భర్త, కొడుకు హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం శవాన్ని మూట కట్టి ఎంజీకెఎల్ కెనాల్ లో పడేశారు. రెండ్రోజుల తర్వాత సింగోటం రిజర్వాయర్లో దామోదర్ గౌడ్ మృత దేహాం తేలింది. ప్రస్తుతం ఆ మహిళ, భర్త, కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.