మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వాయిదా

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణ అక్టోబరు 30వతేదీకి వాయిదా పడింది.మరో పరువునష్టం కేసులో కేటీఆర్ స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు.

Update: 2024-10-23 10:18 GMT

సినీనటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది.

- మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది గుర్మీత్ సింగ్ వకాలత్ దాఖలు చేశారు. మంత్రి తరపున న్యాయవాది గుర్మిత్ సింగ్ కోర్టులో రిప్లై ఫైల్ చేశారు.
- సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ప్రస్థావిస్తూ మంత్రి కొండా సురేఖ ఇటీవల వ్యాఖ్యలపై నటుడు మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ బుధవారం వచ్చింది.
- మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం కేసు వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 30వతేదీకి వాయిదా వేసింది.

కేటీఆర్ స్టేట్ మెంట్ రికార్డు
మరో వైపు తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నాంపల్లి న్యాయస్థానం ముందు కేటీఆర్ హాజరై స్టేట్ మెంట్ ఇచ్చారు. కేటీఆర్ స్టేట్ మెంట్ ను మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. ఒకే రోజు రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం కేసులు కోర్టులో రావడం విశేషం.

మంత్రి కొండా సురేఖపై రూ.100కోట్లకు కేటీఆర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నాంపల్లి కోర్టుకు వచ్చిన కేటీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు వచ్చారు. మేజిస్ట్రేట్‌ శ్రీదేవి ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడైన కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌ వాం గ్మూలాలను సైతం కోర్టు రికార్డు చేసింది.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ నిమిత్తం హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు వచ్చారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేయడంతో ఇవాళ కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది.


Tags:    

Similar News