కవితకు ఢిల్లీ కోర్టు గ్రీన్ సిగ్నల్

తీవ్ర చర్చలకు దారితీస్తున్న కవిత అమెరికా పర్యటన.;

Update: 2025-08-15 09:32 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఆమెను అనుమతిస్తూ న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితుల్లో కవిత పేరు కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించే ఆమె దాదాపు ఆరు నెలలు రిమాండ్‌కు వెళ్లారు. బెయిల్ ఇచ్చిన సమయంలో విచారణకు సహకరించాలని, విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని న్యాయస్థానం తెలిపింది. కాగా తాజాగా విదేశాలకు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం విచారించింది. అనంతరం విదేశీ పర్యటనల చేయడానికి కవితకు అనుమతులు ఇచ్చింది న్యాయస్థానం. 15 మార్చి 2024న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అదుపులోకి తీసుకోగా.. ఆగస్టు నెలలో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

హాట్ టాపిక్‌గా కవిత పర్యటన..

అయితే కవిత.. తన కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాలోని కాలేజీలో చేర్చించాల్సి ఉంది. అందుకోసం ఆమె అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అందుకోసం కవిత.. కోర్టును ఆశ్రయించారు. తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో ఆమె 15రోజుల పాటు అమెరికా పర్యటనకు రెడీ అవుతున్నారు. గతంలో ఆమె తన పెద్ద కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరవడం కోసం అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలోనే కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ.. తెలంగాణ రాజీకాయల్లో ఎంతటి స్థాయి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి కవిత, కేటీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇదే సమయంలో కవిత మరోసారి అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News